దేవరకొండ : దేవరకొండ పట్టణంలో శుక్రవారం ‘ఇంటింటికీ సీపీఐ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి ప్రజలను కలిసి మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వందేళ్లు దాటిందని గుర్తు చేశారు. దేశాన్ని కార్పొరేట్ శక్తుల నుంచి విముక్తి చేసి సమసమాజ స్థాపనకు నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న పార్టీ సీపీఐ అన్నారు. భవిష్యత్‌లో ప్రజా పోరాటాలను మరింత బలోపేతం చేయడానికి భారత కమ్యూనిస్టు పార్టీకి అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, నాయకులు పల్లా నర్సింహారెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు, రమావత్ అంజయ్యనాయక్, కాంతయ్య, పల్లా దేవేందర్‌రెడ్డి, తూం బుచ్చిరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, కనకాచారి తదితరులున్నారు.
రేణుకా ఎల్లమ్మకు మొక్కుబడి కల్యాణం
నల్లగొండ : కనగల్ మండలంలోని దర్వేశిపురం రేణుక ఎల్లమ్మ ఆలయంలో అర్చకుడు నాగోజు మల్లాచారి ఆధ్వర్యంలో శుక్రవారం అమ్మవారికి మొక్కుబడి కల్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ జరిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ అంబటి నాగిరెడ్డి, సిబ్బంది చంద్రయ్య, ఉపేందర్‌రెడ్డి, రాజయ్య, నాగరాజు, ఆంజనేయులు, అర్చకులు గాదే దామోదర్‌రావు, ఫణికుమార్, శ్రీనివాసచారి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
సీఎం సహాయ నిధి పేదలకు వరం
మిర్యాలగూడ : ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయ నిధి వరం లాంటిదని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్ అన్నారు. శుక్రవారం మిర్యాలగూడలోని తన కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, సీఎం సహాయ నిధి ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి తక్షణ సాయం అందుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు మాలి కాంతారెడ్డి, బొంగర్ల సుకన్య వినోద్ పాల్గొన్నారు.
సహకార ఉద్యోగుల సస్పెన్షన్
మోత్కూరు : మోత్కూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ గదిలో రాత్రివేళ ఉద్యోగులు మద్యం సేవించడం వాస్తవమని తేలడంతో సస్పెన్షన్‌కు గురయ్యారు. ఉద్యోగులు పెండెం నరహరి, ఎస్‌కె.యాకూబ్, సీహెచ్.కృష్ణలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా సహకార అధికారి జి.మురళీరమణ శుక్రవారం విలేకరులకు తెలిపారు.


