భువనగిరి : పిల్లల్లో గాయాల వల్ల కలిగే మరణాలను తగ్గించడంలో గోల్డెన్ అవర్ కీలక పాత్ర పోషిస్తుందని ఎయిమ్స్ డైరెక్టర్ అమిత అగర్వాల్, మెడికల్ సూపరింటెండెంట్ లక్కిరెడ్డి అన్నారు. శుక్రవారం ఎయిమ్స్‌లో నిర్వహించిన పిడియాట్రిక్ ట్రామా రిససిటేషన్ మాడ్యూల్ వర్క్‌షాప్‌లో వారు మాట్లాడారు. అనంతరం డాక్టర్ నేహఠాకూర్ రాయ్ పర్యవేక్షణలో డాక్టర్ దేబాసిస్ దాస్ చేతన్ గినిగిరి, అరవింద్ అనందల్ సుమారు 40 మంది నర్సులకు శ్వాసనాళ నిర్వహణ, షాక్ రిససిటెషన్, పాయింట్ ఆఫ్ కేర్, అల్ట్రాసౌండ్ వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి క్విజ్ పోటీల్లో ఎయిమ్స్‌కు చెందిన సీనియర్ రెసిడెంట్లు డాక్టర్ అనన్య శ్రియం, చేతన్ ఎన్ ప్రథమ స్థానంలో నిలిచిన సందర్భంగా వారిని అభినందించారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


