బాల్య వివాహాల రహిత భారత్‌గా తీర్చిదిద్దాలి
మిర్యాలగూడ టౌన్ : బాల్య వివాహాల రహిత భారత్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ చింత కృష్ణయ్య అన్నారు. ‘బాల్య వివాహ రహిత భారత్’ కార్యక్రమంలో భాగంగా శనివారం మిర్యాలగూడలోని మైనార్టీ గురులకు, మిర్యాలగూడ మండలం అవంతీపురం జంగాల కాలనీలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పిల్లలంతా చదువులపై ప్రత్యేక దృష్టిని సారించాలన్నారు. బాల్య వివాహాలను అరికట్టాలంటే చదువే ఆయుధమన్నారు. ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందన్నారు. ఎక్కడైనా, ఎప్పుడైనా బాల్య వివాహాలు జరుగుతున్నప్పుడు 1098 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అరుణ కుమారీ, గౌరీ శంకర్, వెంకన్న, రమణి, సర్పంచ్ సుజాత సురేష్, నాగమణి, రాధిక, శ్రీదేవి, దారం మల్లేష్‌యాదవ్, సువర్ణ, వసుమతి, అంజలిదేవి, సుజిత తదితరులున్నారు.


