నీలగిరిలో 37 మంది కొత్త వారే.. | - | Sakshi
Sakshi News home page

నీలగిరిలో 37 మంది కొత్త వారే..

Feb 15 2026 12:31 PM | Updated on Feb 15 2026 12:31 PM

నీలగిరిలో 37 మంది కొత్త వారే..

నీలగిరిలో 37 మంది కొత్త వారే..

నల్లగొండ టూటౌన్‌ : నీలగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 48 డివిజన్లకు గాను 37 మంది కొత్త అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్‌ తరఫున గెలిచిన 27 మంది కార్పొరేటర్లలో 17 మంది మంది తొలిసారి గెలిచారు. అదే విధంగా బీఆర్‌ఎస్‌ గెలిచిన 9 మందిలో 8 మంది మొదటిసారి విజయం సాధించారు. బీజేపీ నుంచి గెలిచిన నలుగురు కార్పొరేటర్లు సైతం మొదటిసారి గెలిచారు. ఏఐఎఫ్‌బీ సింహం గుర్తుపై గెలిచిన నలుగురు, ఎంఐఎం నుంచి ఇద్దరు, ఇండిపెండింట్లు ఇద్దరు కూడా మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి విజేతలుగా నిలిచిన వారే. కార్పొరేషన్‌లోని 48 డివిజన్లలో 37 మంది కొత్త వారు కాగా, గతంలో గెలిచి అనుభవం ఉన్న వారు 11 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో కాంగ్రెస్‌లో 10 మంది, బీఆర్‌ఎస్‌ నుంచి ఒకరు ఉన్నారు. మొత్తంగా 37 మంది తొలిసారి ఎన్నికల్లో గెలిచి కార్పొరేషన్‌లో అడుగు పెడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement