పాలనలో దక్షత చూపాలి
భూసేకరణ పూర్తి చేయాలి
నల్లగొండ : ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేదకు అందించేందుకు పాలనలో దక్షతను చూపాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం నల్లగొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రొబేషనరీ గ్రూప్–1 అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. నల్లగొండ అతిపెద్ద జిల్లా అని, 566 రెవెన్యూ గ్రామాలు, 869 గ్రామపంచాయతీలు ఉన్నాయని వివరించారు. అధికారులు వారి శిక్షణలో భాగంగా గ్రామాలకు వెళ్లి అధ్యయనం చేసిన అనంతరం ముఖ్యమైన పారామీటర్స్‌పై నివేదిక తయారు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అధ్యయనం చేసి భవిష్యత్‌లో ప్రజలకు సుపరిపాలన అందించేందుకు కృషి చేయాలన్నారు. ఈ శిక్షణ భవిష్యత్‌లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, ఎంసీహెచ్‌ఆర్‌డీ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఓటర్ల మ్యాపింగ్ వేగవంతం చేయాలి
ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ మాట్లాడారు.
నల్లగొండ : పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. నల్లగొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం రెవెన్యూ, ఇరిగేషన్ ఎస్‌డీఎస్, ఆర్ అండ్ ఆర్, ల్యాండ్ అక్విజిషన్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో చేపట్టిన అన్ని సాగునీటి ప్రాజెక్టుల, లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిని విభాగాల వారీగా పరిశీలించి, భూసేకరణ, పునరావాసం, పరిహారం చెల్లింపులు వంటి అంశాల్లో పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం రైతులకు పరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


