సౌర విద్యుత్‌కు రూ. 944 కోట్లు మంజూరు
హాలియా : తెలంగాణ రాష్ట్రంలో సౌర విద్యుత్‌ను వినియోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 944 కోట్లను కేటాయించిందని టీజీఎస్‌పీడీఎల్ సీఎండీ ముషారఫ్ అలీఫారూఖీ వెల్లడించారు. మంగళవారం హాలియా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సౌర విద్యుత్ వినియోగంపై అధికారులతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని 81 గ్రామాల్లో సౌర విద్యుత్ ఏర్పాటు చేస్తున్నామని, మొదటగా కొండారెడ్డిపల్లిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అనుముల గ్రామాన్ని సోలార్ విద్యుదీకరణకు ఎంపిక చేశామని, దానికి గృహ జ్యోతి విద్యుత్ వినియోగదారులకు రెండు కిలో వాట్స్ సోలార్ ప్యానల్ బిగిస్తామని చెప్పారు. అనుముల మండలంలో 605 మంది విద్యుత్ వినియోగదారులకు ఈపథకం వర్తించనుందన్నారు. 7.5 కిలో మీటర్ల పరిధిలోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు అమర్చనున్నామని చెప్పారు. అనుముల గ్రామానికి పూర్తిస్థాయి సౌర విద్యుత్‌ను అందించేందుకుగాను రూ.44.94 కోట్లు మంజూరు చేసిందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, టీఎస్ రెడ్కో అధికారి అనిలా, మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, మార్కెట్ చైర్మన్లు చంద్రశేఖర్‌రెడ్డి, అంకతి సత్యం, మున్సిపల్ వైస్ చైర్మన్ గౌనీ రాజా రమేష్‌యాదవ్, ఏడీఈ తిరుపతయ్య, ఏఈ ధనుంజయ, పాండురంగ తదితరులు ఉన్నారు.
అధికారులతో సమీక్ష
నల్లగొండ : నల్లగొండలోని విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో విద్యుత్ అధికారులతో టీజీఎస్‌పీడీఎల్ సీఎండీ ముషారఫ్ అలీఫారూఖీ సమీక్షించారు. అనుముల, కంగాల్, ముదిగొండ గ్రామాల్లో సుమారు 15 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.97.39 కోట్లు వ్యయం చేయనున్నాన్నారు. మోడల్ సోలార్ గ్రామాలపై మార్గదర్శకాలు వివరించారు.
ఫ టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ
ముషారఫ్ అలీఫారూఖీ


