స్మార్ట్‌ సిటీపై కసరత్తు | - | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ సిటీపై కసరత్తు

Feb 18 2026 7:10 AM | Updated on Feb 18 2026 7:10 AM

స్మార

స్మార్ట్‌ సిటీపై కసరత్తు

నేను పేదల మనిషిని

: మంత్రి కోమటిరెడ్డి

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండలో స్మార్ట్‌ సిటీ పనులు ప్రారంభమయ్యాయి. సోమవారం కార్పొరేషన్‌ పాలకవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. మరుసటి రోజు మంగళవారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెల్లవారుజాము 4 గంటల నుంచే నగరంలో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా స్మార్ట్‌ సిటీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రకాశం బజార్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులను తీర్చేందుకు దగ్గరుండి డివైడర్లను తొలగింపజేశారు.

గుట్టలు ఎక్కి పరిశీలన

మంత్రి కోమటిరెడ్డి తెల్లవారుజాము 4 గంటలకే లతీఫ్‌సాహెబ్‌గుట్ట, బ్రహ్మంగారిగుట్ట పైకెక్కి పట్టణ వ్యూను పరిశీలించారు. ఆ తర్వాత మున్సిపల్‌, విద్యుత్‌ శాఖ అధికారులతో పాటు పోలీసులతో ప్రకాశంబజార్‌ చేరుకున్నారు. ప్రకాశంబజార్‌లోని డివైడర్‌ మధ్యలో చిరు వ్యాపారం చేయడంతో ట్రాఫిక్‌ రద్దీ పెరిగి ప్రమాదాలు సంభవిస్తున్నాయని కొందరు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన డివైడర్‌ తొలగింపు కార్యక్రమం చేపట్టారు. జేసీబీలను రప్పించి అక్కడే ఉండి డివైడర్లను తొలగించడంతో పాటు మట్టిని వెంటనే తొలగించి సాయంత్రంలోగా రోడ్డును వేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడ వ్యాపారం చేసుకునే వారికి పక్కనే ఉన్న పాత కలెక్టరేట్‌ స్థలాన్ని ఇవ్వాలని సూచించారు. దీంతో అధికారులు వెంటనే ప్రకాశంబజార్‌ ఎక్బాల్‌ మీనార్‌ నుంచి మైసయ్య విగ్రహం వరకు ఉన్న డివైడర్లను తొలగించారు. ప్రకాశంబజార్‌లో తొలగించిన డివైడర్ల స్థానంలో యథావిధిగా రోడ్డు వేస్తున్నారు.

రూ.20 కోట్లతో అండర్‌గ్రౌండ్‌ కేబుల్‌ ప్రాజెక్టు

ప్రకాశంబజార్‌ ఎక్బార్‌ మీనార్‌ నుంచి డివైడర్‌ తొలగించిన ప్రాంతం గుండా మైసయ్య విగ్రహం నుంచి బస్టాండ్‌ మీదుగా గొల్లగూడ అవుట్‌డోర్‌ స్టేడియం వరకు రూ.20 కోట్లతో అండర్‌గ్రౌండ్‌ కేబుల్‌ పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా పండ్ల వ్యాపారి ఖాదర్‌ వద్ద రూ.30 వేలు పెట్టి పండ్లు కొనుగోలు చేసి అక్కడ పంపిణీ చేశారు. రోడ్డు వెడల్పు వల్ల రద్దీ తగ్గుతుందన్నారు. చిరు వ్యాపారులకు అన్యాయం జరగనీయమని.. వారిని కాపాడుకునే బాధ్యత తనదేనని చెప్పారు. కార్యక్రమంలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ శరత్‌చంద్ర, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మంగళవారం ఉదయం ప్రకాశం బజారులో డివైడర్‌ను తొలగిస్తున్న జేసీబీ, డివైడర్‌ తొలగించిన చోట వేస్తున్న రోడ్డు

ప్రకాశం బజారులో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ తాను పేదల మనిషినని, చిరు వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలకుండా వారు వ్యాపారం చేసుకునేలా పాత కలెక్టరేట్‌లో స్థలం కేటాయిస్తున్నామని చెప్పారు. చిరు వ్యాపారులకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. 70 మంది చిరు వ్యాపారులు డివైడర్‌పై వ్యాపారం నిర్వహిస్తున్నారని వారికి 50 నుంచి 100 గజాల స్థలం కేటాయిస్తున్నామన్నారు. ప్రకాశంబజార్‌ నల్లగొండకు గుండెకాయ లాంటిదని, అక్కడ వ్యాపారం పెరగడంతో పాటు రద్దీ పెరిగి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఈ నిర్నయం తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం పాత కలెక్టరేట్‌లో ఉన్న డీసీఎం వాహనాల పార్కింగ్‌ను మునుగోడు రోడ్డులోని హౌసింగ్‌ బోర్డుకు తరలించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు.

ఫ నీలగిరిలో తెల్లవారుజామున

4 గంటల నుంచే మంత్రి

కోమటిరెడ్డి పర్యటన

ఫ ప్రకాశం బజారులో డివైడర్‌ను దగ్గరుండి కూల్చి వేయించిన మంత్రి

ఫ చిరు వ్యాపారులకు పాత కలెక్టరేట్‌ స్థలం కేటాయించాలని ఆదేశాలు

ఫ నగర పాలకవర్గ ప్రమాణ

స్వీకారం చేసిన మరుసటిరోజే

విస్తరణ పనులకు శ్రీకారం

స్మార్ట్‌ సిటీపై కసరత్తు1
1/2

స్మార్ట్‌ సిటీపై కసరత్తు

స్మార్ట్‌ సిటీపై కసరత్తు2
2/2

స్మార్ట్‌ సిటీపై కసరత్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement