ఎంజీయూ విద్యార్థులకు వీసీ అభినందన
నల్లగొండ టూటౌన్ : ఎంజీ యూనివర్సిటీలో మంగళవారం ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ పలువురు విద్యారుథలను అభినందించారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్‌లోని తెలుగు శాఖకు చెందిన విద్యార్థులు లింగరాజు, నవ్య యూజీసీ నిర్వహించిన జాతీయ అర్హత పరీక్షలో ప్రతిభ కనబరిచారు. శ్రీధర్, అంజి, జగన్, ఎస్‌కె.సనా, ప్రశాంత్, మల్లేపల్లి, మమత పీహెచ్‌డీలో ప్రవేశం పొందడానికి అర్హత సాధించారు. 21వ శతాబ్దపు సీ్త్రల సాహిత్యం సమాలోచన అనే అంశంపై కర్నూల్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సెమినార్‌లో పత్ర సమర్పణ చేసిన విద్యార్థులు మంద స్నేహిత, ధరంసోత్ లలిత, ఏపీలో నిర్వహించే అంతర్జాతీయ రచయితల మహాసభలకు కాట్రావత్ గణేష్ ఎంపికయ్యారు. వీరిని వీసీ అభినందించి.. సాహిత్య, సృజన రంగాల్లో నిరంతరం కృషి చేస్తూ విశ్వవిద్యాలయానికి పేరు తేవాలని కోరారు. కార్యక్రమంలో అరుణ ప్రియ, మ్యాతరి ఆనంద్, మద్దిరాల సత్యనారాయణరెడ్డి, అనితకుమారి, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి
నల్లగొండ : ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆదేశించారు. మంగళవారం నల్లగొండలోని తన చాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్ష కేంద్రల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కష్టపడేతత్వం అలవర్చుకోవాలి
నల్లగొండ టూటౌన్ : విద్యార్థులు మొదటి నుంచే కష్టపడేతత్వం అలవరుచుకోవాలని నల్లగొండ అదనపు ఎస్పీ రమేష్ అన్నారు. మంగళవారం నల్లగొండలో సీఎం కప్ జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం మాట్లాడారు. ఫుట్‌బాల్, హ్యాండ్ బాల్, బాల్ బ్యాడ్మింటన్, నెట్‌బాల్ క్రీడలు నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ అక్బర్‌అలీ, బొమ్మపాల గిరిబాబు, పుల్లయ్య, బయన్న, కిరణ్ కుమార్ ఉన్నారు.
యూరియా
అందుబాటులో ఉంది
మిర్యాలగూడ : జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) శ్రవణ్‌కుమార్ అన్నారు. మంగళవారం దామరచర్ల రైతువేదికలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు సంబందిత 13బీ లేదా వన్ బీ జిరాక్స్ కాపీలను, ఆధార్ లేకుండా సాగుచేసే వాళ్లు గ్రామ పరిపాలన అధికారి, ఏఈఓలను సంప్రదించి ఆన్‌లైన్ చేసుకుని యూరియా బుకింగ్ యాప్ ద్వారా యూరియా పొందవచ్చని అన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఏడీఏ సైదానాయక్, ఏఓ రుషేంద్రమణి, ఏఈఓ పార్వతి, సైదులు, సీఈఓ వెంకట్‌రెడ్డి, రైతులు శ్యాంసుందర్, వెంకటేశ్వర్లు ఉన్నారు.
ఎంజీయూ విద్యార్థులకు వీసీ అభినందన
ఎంజీయూ విద్యార్థులకు వీసీ అభినందన


