పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలని వినతి | - | Sakshi
Sakshi News home page

పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలని వినతి

Feb 19 2026 10:15 AM | Updated on Feb 19 2026 10:15 AM

పాత ప

పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలని వినతి

నల్లగొండ టౌన్‌ : మొబైల్‌ యాప్‌ ద్వారా యూ రియా పంపిణీతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. పాత పద్ధతిలోనే యూరియా అందించాలని కోరుతూ రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి కలెక్టర్‌ చంద్రశేఖర్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన యాప్‌ ద్వారా రైతులు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్‌కు వివరించారు. అనేక మంది రైతులకు స్మార్ట్‌ ఫో న్లు లేవని, ఉన్న రైతులకు యాప్‌పై అవగాహన లేదన్నారు. యాప్‌ నిబంధనలు తీసి వేసి రైతులకు ఎప్పటిలా పాత పద్ధతిలో యూరియా అందించాలని కోరారు. లేకపోతే పంట దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉందన్నారు.

క్యాన్సర్‌పై అవగాహన

నల్లగొండ టౌన్‌ : ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం నల్లగొండలోని దీప్తి గ్రూప్‌ ఆఫ్‌ నర్సింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థినులకు క్యాన్సర్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెచ్‌పీవీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ డాక్టర్‌ వసంతకుమారి, డాక్టర్‌ రాజేశ్వరి మాట్లాడుతూ క్యాన్సర్‌ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్‌ జయకుమారి, లెక్చరర్లు పాల్గొన్నారు.

పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి

నల్లగొండ : పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌.రజినీకాంత్‌, టి.నాగరాజు డిమాండ్‌ చేశారు. బుధవారం నల్లగొండలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులను వారు ప్రారంభించి మాట్లాడారు. స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు పైచదువులకు వెళ్లడానికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఖమ్మంపాటి శంకర్‌, మమత, కిరణ్‌, అశోక్‌రెడ్డి, ఆకారపు నరేష్‌, తారాసింగ్‌, రమ్య, శ్రీకాంత్‌, అక్బర్‌, అజయ్‌, భరత్‌, విఘ్నేష్‌, కుర్ర సైదానాయక్‌, కుంచం కావ్య, రమేష్‌, బుడిగ వెంకటేష్‌, మారుపాక కిరణ్‌, స్పందన, రియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆంగ్ల భాష పరిజ్ఞానంతో ఆత్మవిశ్వాసం

నల్లగొండ టూటౌన్‌ : ఆంగ్ల భాష పరిజ్ఞానంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఎంజీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌ అన్నారు. ఆయన బుధవారం నల్లగొండలోని ఎంజీయూలో ఇంగ్లిష్‌ లాంగ్వెజ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు ఇన్‌చార్జి డైరెక్టర్‌గా దండా రవీందర్‌రెడ్డికి నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంగ్ల పరిజ్ఞానంతో విద్యార్థులు మెరుగైన అవకాశాలను అందుకోవచ్చన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ అల్వాల రవి, ఆంగ్ల విభాగ అధిపతి అరుణప్రియ, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కొప్పుల అంజిరెడ్డి పాల్గొన్నారు.

పాఠశాలల తనిఖీ

చండూరు : చండూరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలను జిల్లా విద్యాఽధికారి బొల్లారం భిక్షపతి బుధవారం తనిఖీ చేశారు. చండూరులోని జిల్లా పరిషత్‌ పాఠశాల, కేజీబీవీ, చండూరు ప్రాథమిక పాఽఠశాలలను పరిశీలించిన ఆయన విద్యార్థులకు గుణాత్మక విద్యను బోధిందించాలని, టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌ వినియోగించి విషయ బోధన జరగాలని ఉపాధ్యాయులకు సూచించారు. కేజీబీవీలో బాలికలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి ఆహార పదార్థాలను, కూరగాయలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు.

పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలని వినతి1
1/2

పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలని వినతి

పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలని వినతి2
2/2

పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలని వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement