శివన్నగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

శివన్నగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన

Feb 19 2026 10:15 AM | Updated on Feb 19 2026 10:15 AM

శివన్నగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన

శివన్నగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన

మర్రిగూడ : శివన్నగూడెం రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న నర్సిరెడ్డిగూడెం గ్రామస్తులకు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చొరవతో మంజూరైన 54 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను హౌసింగ్‌ పీడీ రాజ్‌కుమార్‌ బుధవారం శివన్నగూడెంలో పరిశీలించారు. పలువురు లబ్ధిదారులు ఇప్పటివరకు తమకు ఎలాంటి ఇంటి బిల్లులు అందలేదని ఆయన పీడీ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లి బిల్లులు అందేలా చూస్తానని పీడీ వారికి భరోసా కల్పించారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో నిర్మించిన ఇందిరమ్మ నమూన ఇంటిని పరిశీలించారు. ఆయన వెంట డీఈ అబ్దుల్‌వాజిద్‌, ఎంపీడీఓ జి.చినమునయ్య, ఏఈ ఈశ్వర్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement