ఉన్నత లక్ష్యంతో చదువుకోవాలి
విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదువుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్‌లుగా తీర్చిదిద్దేందుకు అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. విద్యార్థులకు ఇంటర్ కీలకమని ఈ దశలో భవిష్యత్ నిర్ణయమవుతుందని తెలిపారు. భవిష్యత్‌లో కృత్రిమ మేధ రంగంలో విస్త్రత అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఎంసెట్ కోచింగ్ మెటీరియల్ విద్యార్థులకు అందిస్తామన్నారు. కళాశాలకు నూతన భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తానని ఆదివారంలోగా కొత్త భవనాల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలని కమిషనర్‌కు సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మేయర్ బుర్రి చైతన్య, కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్‌చంద్ర పవార్, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ, కళాశాల ప్రిన్సిపాల్ పద్మ పాల్గొన్నారు


