హ్యాట్రిక్ గెలుపు
దేవరకొండ: దేవరకొండ మున్సిపాలిటీలోని 19వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తాళ్ల శ్రీధర్‌గౌడ్ 211 ఓట్ల మెజార్టీతో గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. ఆయన 2014, 2020లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మూడుసార్లు శ్రీధర్‌గౌడ్‌కి ఏసీ గుర్తే కేటాయించటం విశేషం.
నల్లగొండ టూటౌన్: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ నుంచి 40వ డివిజన్‌లో బొడ్డుపల్లి లక్ష్మి, 30వ డివిజన్ నుంచి మారగోని నవీన్‌కుమార్ విజయం సాధించారు. వారిద్దరికీ ఇది హ్యాట్రిక్ విజయం. బొడ్డుపల్లి లక్ష్మి ఇప్పటికే రెండుసార్లు గెలుపొందగా.. నవీన్‌కుమార్ ఒక సారి బీఆర్‌ఎస్ నుంచి, రెండుసార్లు కాంగ్రెస్ నుంచి వరుసగా విజయం సాధించారు.


