సంత్ సేవాలాల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
నల్లగొండ టౌన్ : నీతి, నిజాయితీ, ధర్మం వంటి సత్యమార్గాలు బోధించిన సంత్ సేవాలాల్ మహరాజ్‌ను ఆదర్శంగా తీసుకుని సమాజం ముందుకెళ్లాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. సంత్‌సేవాలాల్ మహరాజ్ 267వ జయంతి సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్‌లో సంత్‌సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భోగ్ బండార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంత్‌సేవాలాల్ మహరాజ్ లంబాడా, గిరిజన జాతిలోని మూఢనమ్మకాలను పారదోలి వారి అభ్యున్నతికి కృషి చేశారన్నారు. సంత్‌సేవాలాల్ స్ఫూర్తితో రూపొందించిన రాజ్యాంగం, హక్కులు, ప్రభుత్వ పథకాలు పేదలకు అందించేందుకు ప్రభుత్వం ముందుంటుందన్నారు. మేయర్ బుర్రి చైతన్య మాట్లాడుతూ సంత్‌సేవాలాల్ మహరాజ్ సేవా, ధర్మం, సమభావనలను బోధించిన మహనీయుడన్నారు. కార్యక్రమంలో ప్రవీణ్‌నాయక్, చత్రునాయక్, సకృనాయక్, నర్సింహ, అడిషనల్ ఎస్పీ రమేష్, డిప్యూటీ మేయర్ ఆష్రఫ్, పరుశరాం, కార్పొరేటర్లు దీప్లానాయక్, నాగార్జున, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


