సీఎంఆర్‌ ధాన్యం మాయంపై ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

సీఎంఆర్‌ ధాన్యం మాయంపై ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు

Feb 24 2026 7:46 AM | Updated on Feb 24 2026 7:46 AM

సీఎంఆ

సీఎంఆర్‌ ధాన్యం మాయంపై ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు

సీఎంకు వివాహ

ఆహ్వాన పత్రిక అందజేత

నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి మండలం గోపలాయిపల్లిలోని వారిజాల వేణుగోపాల స్వామి దేవాలయ అనువంశిక చైర్మన్‌ కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి మనుమరాలు (కొడుకు కుమార్తె) వివాహం ఈ నెల 25న హైదరాబాద్‌లో జరగనుంది. సోమవారం కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి తన సోదరుడైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి హైదరాబాదులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు. తన మనుమరాలి వివాహానికి రావాలని మోహన్‌రెడ్డి సీఎంను కోరారు.

ఎంజీయూ డిగ్రీ ఫలితాలు విడుదల

నల్లగొండ టూటౌన్‌ : మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ బ్యాక్‌ లాగ్‌ రీవాల్యుయేషన్‌ ఫలితాలను విడుదల చేసినట్లు సీఓఈ ఉపేందర్‌రెడ్డి సోమవారం తెలిపారు. ఫలితాల పూర్తి వివరాలు ఎంజీయూ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వెల్లడించారు.

ఎంజీయూలో నైపుణ్యాభివృద్ధి కోర్సు

నల్లగొండ టౌన్‌ : మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో వినూత్నంగా వివిధ క్రీడాంశాలపై అవగాహన కల్పించేందుకు నైపుణ్యాభివృద్ధి కోర్సును ప్రవేశ పెట్టినట్లు వ్యాయామ అధ్యపకులు మురళి, వై.శ్రీనివాస్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సులో భాగంగా ప్రధాన క్రీడాంశాలు, వాటి విధివిధానాలు పాఠ్యాంశాలుగా బోధించడంతో పాటు ప్రత్యక్ష శిక్షణ ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఇంజనీరింగ్‌ విద్యార్థులకు వాలీబాల్‌పై అవగాహన కల్పనతో పాటు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సు ను అధికారికంగా ప్రారంభించినట్లు వెల్లడించారు.

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై ఎట్టకేలకు యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. జిల్లాలో ఏడు మిల్లులు వేలం వేసిన సీఎంఆర్‌ బియ్యాన్ని దారి మళ్లించాయని, ఈ విషయం తమ తనిఖీల్లో నిర్ధారణ అయిందని, ఆయా మిల్లుల యాజమాన్యాలపై క్రిమినల్‌ చర్యలు చేపట్టాలంటూ పోలీస్‌స్టేషన్లలో పౌరసరఫరాల సంస్థ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో తదుపరి కార్యాచరణపై పోలీసు శాఖ దృష్టి సారించింది. భారతీయ న్యాయ సంహిత 316 (2), 316(5), 318 (3), ఎషెన్షియల్‌ కమాడిటీస్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 7 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయా మిల్లర్లు అంతా పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే అందులో కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు ఆయా మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్‌ అమలు చేసి వారి ఆస్తులను జప్తు చేస్తామని, జరిగిన నష్టాన్ని వసూలు చేస్తామని పౌరసరఫరాల విభాగం వెల్లడించింది.

అసలేం జరిగిందంటే..

2022–23 సంవత్సరంలో సీఎంఆర్‌ కోసం జిల్లాలోని మిల్లులకు జిల్లా పౌరసరఫరాల విభాగం ధాన్యాన్ని కేటాయించింది. అందులో భాగంగా చిట్యాల మండలంలోని వరలక్ష్మి పార్‌బాయిల్డ్‌ మిల్లు, కేతేపల్లిలోని చాముండేశ్వరి పార్‌బాయిల్డ్‌, మనుగోడులోని మరళీ మనోహర్‌ ఆగ్రోఫుడ్స్‌, నల్లగొండలోని రామ్‌లక్ష్మణ్‌, కనకమహాలక్ష్మి, సుమాంజలి, గౌతమి ఇండస్ట్రీస్‌ మిల్లులకు కూడా ధాన్యం ఇచ్చింది. అయితే ఆ మిల్లులు ఇంతవరకు సీఎంఆర్‌ బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఏడాది కిందట ప్రభుత్వం మిల్లుల్లో మిగిలిపోయిన ధాన్యాన్ని వేలం వేసింది. దానిని కొనుగోలు చేసిన వారికి ధాన్యం ఇవ్వాల్సి ఉంది. ధాన్యం లేకపోతే దాని విలువ ప్రకారం డబ్బులు ఇవ్వాల్సి ఉంది.

ఆ ఏడు మిల్లులకు ఇచ్చిన 5,89,533 క్వింటాళ్ల ధాన్యానికి రూ.191.13 కోట్లు మిల్లర్లు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేదు. అయినా.. ముడుపుల బాగోతంలో కొందరు అధికారులు అప్పట్లో పెద్దగా పట్టించుకోలేదు.

5,89,533 క్వింటాళ్లు మాయం..

నల్లగొండ జిల్లాలోని ఆ ఏడు మిల్లుల్లో 5,89,533 క్వింటాళ్ల ధాన్యం పక్కదారి పట్టించినట్లు తేలింది. గత ఏడాదే ఈ అక్రమాలను తేల్చినా ఇంతవరకు చర్యలు చేపట్టకుండా కాలయాపన చేశారు. చిన్న తప్పు జరిగితే గగ్గోలు పెట్టే అధికారులు ఏకంగా ఏడు మిల్లులు రూ.191.13 కోట్ల విలువైన ధాన్యం అమ్ముకున్నా పట్టించుకోలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆర్‌ఆర్‌ యాక్ట్‌ అమలు చేసేనా!

ధాన్యం ఎగ్గొట్టిన మిల్లర్లపై జిల్లా యంత్రాంగం ఫిర్యాదు చేయడంతో పోలీసులు క్రిమినల్‌ కేసులను నమోదు చేశారు. మరోవైపు ఆర్‌ఆర్‌ యాక్ట్‌ అమలు చేస్తామని జిల్లా పౌర సరఫరాల విభాగం చెబుతోంది. అయితే ప్రస్తుతం ఆయా మిల్లులపై పోలీసులు నమోదు చేసే క్రిమినల్‌ కేసులకే పరిమితం అవుతుందా? ఆచరణలో ఆర్‌ఆర్‌ యాక్ట్‌ను అమలు చేస్తుందా? చూడాలి.

ఫ మిల్లర్లపై చర్యలకు మూడేళ్లుగా అధికారుల మీనమేషాలు

ఫ పలుమార్లు కథనాలను ప్రచురించిన ‘సాక్షి’

ఫ అయినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన యంత్రాంగం

ఫ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో చలనం

ఫ ఆర్‌ఆర్‌ యాక్ట్‌ అమలు చేస్తామంటున్న అఽధికారులు

జిల్లాలో 2022–23 యాసంగి సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్‌ ధాన్యాన్ని మాయం చేయడంపై గత ఏడాది ఆగస్టులోనే ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో అప్పటి పౌరసరఫరాల కమిషనర్‌ విచారణకు ఆదేశించారు. అప్పట్లో మిల్లుల్లో తనిఖీలు చేపట్టి, అక్రమాలు నిజమేనని అధికారుల తనిఖీ బృందాలు తేల్చాయి. అయినా చర్యలు చేపట్టడంలో జాప్యం చేశారు. జిల్లాలో మిల్లర్ల అక్రమాలపై ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులు, అక్రమాలను తేల్చిన వైనం, అయినా మిల్లర్ల బుకాయింపుపై ‘సాక్షి’ దిన పత్రిక ప్రత్యేక కథనాలను ప్రచురించింది. తాజాగా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని క్రిమినల్‌ చర్యలకు ఆదేశించింది. రెవెన్యూ రికవరీ (ఆర్‌ఆర్‌) యాక్ట్‌ పెట్టాలని స్పష్టం చేయడంతో జిల్లా పౌరసరఫరాల సంస్థ అధికారులు సోమవారం వివిధ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.

మిల్లుల్లో కనిపించకుండా పోయిన ధాన్యం, కేసుల వివరాలు..

పోలీస్‌ స్టేషన్‌ మిల్లుపేరు ధాన్యం విలువ

(క్వింటాళ్లలో) (రూ.కోట్లలో)

చిట్యాల వరలక్ష్మి పార్‌బాయిల్డ్‌ 59,538 19.33

కేతేపల్లి చాముండేశ్వరి పార్‌బాయిల్డ్‌ 1,39,670 45.36

మునుగోడు మరళీ మనోహర్‌ ఆగ్రోఫుడ్స్‌ 4,500 1.46

నల్లగొండ టూటౌన్‌ రామ్‌లక్ష్మణ్‌ 78,110 25.36

నల్లగొండ టూటౌన్‌ కనకమహాలక్ష్మి 80,260 26.06

నల్లగొండ రూరల్‌ సుమాంజలి 67,662 21.97

నల్లగొండ రూరల్‌ గౌతమి ఇండస్ట్రీస్‌ 1,59,803 51.89

సీఎంఆర్‌ ధాన్యం మాయంపై ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు 1
1/3

సీఎంఆర్‌ ధాన్యం మాయంపై ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు

సీఎంఆర్‌ ధాన్యం మాయంపై ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు 2
2/3

సీఎంఆర్‌ ధాన్యం మాయంపై ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు

సీఎంఆర్‌ ధాన్యం మాయంపై ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు 3
3/3

సీఎంఆర్‌ ధాన్యం మాయంపై ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement