ఎర్రబెల్లి ఆలయానికి దేవరపెట్టె
నిడమనూరు : ఎర్రబెల్లి లింగమంతులస్వామి జాతరలో ప్రధాన ఘట్టం దేవరపెట్టరాక, దిష్టిపూజ సోమవారం నిర్వహించారు. ఎర్రబెల్లి జాతర వచ్చేనెల 7 నుంచి నాలుగు రోజులపాటు సాగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం దేవరపెట్టను మాడ్గులపల్లి మండలం గోపాలపురం నుంచి యాదవులు(ఎర్రబెల్లి గ్రామ పూర్వికులు) నల్లబోతు, పడాల, బోడే వంశస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆదివారం రాత్రి ఎర్రబెల్లి గ్రామానికి తీసుకొచ్చారు. దేవరపెట్టతో వస్తున్న యాదవులకు ఎర్రబెల్లి వాసులు ఘనస్వాగతం పలికారు. అనంతరం దేవరపెట్టను ఎర్రబెల్లి గట్ట వద్ద ఆలయానికి చేర్చారు. గుట్ట చుట్టు దిష్టిపూజ నిర్వహించారు. అనంతరం అమ్మవార్లకు జీవాలను బలిచ్చారు. కార్యక్రమాల్లో ఆలయ కమిటీ చైర్మన్ మన్నెం వెంకన్న, సర్చంచ్ ఐతగోని మధు, బీజేపీ నాయకుడు మన్నెం రంజిత్‌యాదవ్, పెద్ద సంఖ్యలో యాదవులు, స్థానిక గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
ఫ గట్టుపైన దిష్టిపూజ నిర్వహించిన యాదవ పూజారులు
ఫ మార్చి 7 నుంచి నాలుగు రోజులపాటు జాతర


