నీటి వనరులపై నివేదిక ఇవ్వండి
ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్ –163 సెక్షన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షల కోసం జిల్లాలో 45 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు రాయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్ష సమయంలో పరీక్ష కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు.
నల్లగొండ : నీటి వనరులపై సమగ్ర సర్వే నిర్వహించి ఈ నెల 27లోగా నివేదిక సమర్పించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ, మున్సిపల్, సర్వే, సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి.. చెరువులు, కుంటలు, కాల్వల స్థితిగతులపై నివేదిక ఇవ్వాలన్నారు. మున్సిపాలిటీ పరిధి లోని ప్రతి వాటర్‌బాడీకి సంబంధించిన పూర్తి మ్యాప్, సర్వే నంబర్లు, ఎఫ్‌టీఎల్ పరిమితులు, బఫర్ జోన్ వివరాలు సమగ్రంగా సేకరించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీని వాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమి త్, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
గడవులోగా పనులు పూర్తిచేయాలి
నల్లగొండ : ప్రభుత్వ భవనాల నిర్మాణాలను ప్రాధాన్యత క్రమంలో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ అభివృద్ధి పనులపై ఇంజనీరింగ్, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న మూత్రశాలలు, అంగన్‌వాడీ, పంచాయతీ భవనాలు, పాఠశాల ప్రహరి గోడల నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. పీఎంశ్రీ పాఠశాలలు, మహాత్మ జ్యోతీరావు ఫూలే పాఠశాలల్లో చేపడుతున్న మౌలిక సదుపాయాల పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


