ఘనంగా కేసీఆర్ జన్మదినం
నల్లగొండ టూటౌన్ : బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మంగళవారం నల్లగొండలోని ఆ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కేక్ కట్‌చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అకుంఠిత దీక్షతో పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నాయకులు కటికం సత్తయ్యగౌడ్, మాలె శరణ్యారెడ్డి, చెరుకు సుధాకర్, చీర పంకజ్‌యాదవ్, నిరంజన్‌వలి, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, కరీంపాషా, కంచనపల్లి రవీందర్‌రావు, బోనగిరి దేవేందర్, దేప వెంకట్‌రెడ్డి, సింగం రామ్మోహన్, బక్క పిచ్చయ్య, మారగోని గణేష్ తదితరులు పాల్గొన్నారు.


