కాంగ్రెస్‌కే పట్టణం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కే పట్టణం

Feb 14 2026 9:46 AM | Updated on Feb 14 2026 9:46 AM

కాంగ్రెస్‌కే పట్టణం

కాంగ్రెస్‌కే పట్టణం

సూర్యాపేట జిల్లాలో ఇలా.. యాదాద్రి భువనగిరి జిల్లాలో..

● నల్లగొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 48 డివిజన్లుండగా 27 డివిజన్లలో కాంగ్రెస్‌, 9 డివిజన్లలో బీఆర్‌ఎస్‌, 4 డివిజన్లలో బీజేపీ, 2 డివిజన్లలో ఎంఐఎం, 4 డివిజన్లలో ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌(ఏఐఎఫ్‌బీ) అభ్యర్థులు, ఇద్దరు స్వతంత్రులు విజయం సాధించారు. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడంతో మేయర్‌ స్థానం కాంగ్రెస్‌ కై వసం చేసుకుంది.

● మిర్యాలగూడలో కాంగ్రెస్‌ 31 వార్డుల్లో, బీఆర్‌ఎస్‌ 14, బీజేపీ 1 వార్డు దక్కించుకోగా ఏఐఎఫ్‌బీ నుంచి ఒకరు, స్వతంత్రులు ఒకరు విజయం సాధించారు. కాంగ్రెస్‌ మిర్యాలగూడ మున్సిపాలిటీలో జెండా ఎగురవేయనుంది.

● దేవరకొండ మున్సిపాలిటీలో 11 వార్డుల్లో కాంగ్రెస్‌, 6 వార్డుల్లో బీఆర్‌ఎస్‌, 1 వార్డులో బీజేపీ, 2 వార్డుల్లో స్వతంత్రులు గెలుపొందారు. ఇక్కడ మున్సిపాలిటీ చైర్మన్‌ పీఠం కాంగ్రెస్‌ హస్తగతం చేసుకుంది.

● చండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ 6, బీఆర్‌ఎస్‌ 3 వార్డుల్లో, సీపీఐ ఒక వార్డు దక్కించుకున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకే చైర్మన్‌ పదవి దక్కనుంది.

● హాలియా మున్సిపాలిటీలో 11 వార్డుల్లో కాంగ్రెస్‌, 1 వార్డులో బీఆర్‌ఎస్‌ గెలుపొందాయి. హాలియా మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్‌ పార్టీ హస్తగతం చేసుకుంది.

● నందికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ 11 వార్డుల్లో, బీఆర్‌ఎస్‌ 1 వార్డు గెలుచుకుంది. ఇక్కడ పూర్తి మెజార్టీ కాంగ్రెస్‌ సాధించింది.

● చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ 9, బీఆర్‌ఎస్‌ 2, స్వతంత్ర అభ్యర్థులు 1 స్థానంలో విజయం సాధించారు. కాంగ్రెస్‌ పార్టీ మున్సిపాలిటీని కై వసం చేసుకుంది.

● సూర్యాపేటలో కాంగ్రెస్‌ 31 స్థానాల్లో గెలుపొందగా.. బీఆర్‌ఎస్‌ 11 స్థానాలకు పరిమితమైంది. ఒక వార్డులో బీజేపీ, 5 వార్డుల్లో స్వతంత్రులు గెలిచారు. ఇక్కడ కూడా కాంగ్రెస్‌ భారీ మెజార్టీ సాధించింది.

● కోదాడలో 35 స్థానాలు ఉంటే అత్యధికంగా 26 వార్డుల్లో కాంగ్రెస్‌ గెలుపొందింది. అక్కడ బీఆర్‌ఎస్‌ 3 స్థానాలకే పరిమితం కాగా, స్వతంత్రులు ఆరుగురు గెలుపొందారు.

● నేరేడుచర్లలో 9 స్థానాల్లో కాంగ్రెస్‌, 5 స్థానాల్లో బీఆర్‌ఎస్‌, జనసేన 1 స్థానంలో గెలిచింది. ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ అధిక స్థానాల్లో గెలిచింది.

● హుజూర్‌నగర్‌లో 19 స్థానాల్లో కాంగ్రెస్‌, 4 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ గెలుపొందాయి. సీపీఐ, సీపీఎంలు ఒక్కో స్థానంలో గెలుపొందగా ముగ్గురు స్వతంత్రులు గెలిచారు. కాంగ్రెస్‌ అధిక స్థానాల్లో గెలిచి చైర్మన్‌ స్థానం కై వసం చేసుకోనుంది.

● తిరుమలగిరి మున్సిపాలిటీల్లో 15 స్థానాలు ఉండగా.. 10 స్థానాల్లో బీఆర్‌ఎస్‌, 5 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ రావడంతో ఆ పార్టీనే చైర్మన్‌ పీఠం దక్కించుకోనుంది.

● భువనగిరిలో కాంగ్రెస్‌ 22 స్థానాలు దక్కించుకుంది. బీఆర్‌ఎస్‌ 4, బీజేపీ 4, స్వతంత్రులు 5 వార్డుల్లో విజయం సాధించారు. కాంగ్రెస్‌ అత్యధిక స్థానాల్లో విజయం సాదించింది.

● పోచంపల్లిలో మొత్తం 13 స్థానాలకు కాంగ్రెస్‌ 6 వార్డులు, బీఆర్‌ఎస్‌ 5 వార్డుల్లో గెలిచింది. బీజేపీ ఒక వార్డులో, స్వతంత్రులు ఒక వార్డులో గెలిచారు. స్వతంత్ర అభ్యర్ధి కాంగ్రెస్‌కు మద్దతు తెలుపడంతో అంతా క్యాంపునకు వెళ్లారు. దీంతో పోచంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్‌కు దక్కనుంది.

● యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 8 కాంగ్రెస్‌, 1 బీఆర్‌ఎస్‌, 2 బీజేపీ, 1 సీపీఎం అభ్యర్ధి విజయం సాధించారు. కాంగ్రెస్‌ మున్సిపాలిటీని కై వసం చేసుకుంది.

● ఆలేరులో కాంగ్రెస్‌ 7 స్థానాల్లో విజయం సాధించగా.. బీఆర్‌ఎస్‌ 3, బీజేపీ 2 స్థానాలకే పరిమితమైంది. 7 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ మున్సిపాలిటీ చైర్మన్‌ స్థానం దక్కించుకోనుంది.

● చౌటుప్పల్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ 13 స్థానాల్లో గెలువగా, బీఆర్‌ఎస్‌ 3, బీజేపీ 3 స్థానాల్లో విజయం సాధించగా సీపీఎం 1 స్థానానికి పరిమితమైంది. ఇక్కడ 13 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్‌ మున్సిపాలిటీపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేసింది.

● మోత్కూరు మున్సిపాలిటీలో మొత్తం 12 కౌన్సిలర్‌ స్థానాలు ఉండగా.. 8 స్థానాల్లో కాంగ్రెస్‌, 3 స్థానాల్లో బీఆర్‌ఎస్‌, ఒక స్థానంలో స్వతంత్రులు గెలిచారు. ఎనిమిదింట్లో గెలిచి కాంగ్రెస్‌ చైర్మన్‌ స్థానం దక్కించుకోనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement