ఒక్క ఓటుతో విజయం
మిర్యాలగూడ : మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి బూడిద సైదులు బీఆర్‌ఎస్ అభ్యర్థిపై ఒక్క ఓటుతో విజయం సాధించారు. వార్డులో మొత్తం 2241 ఓట్లు ఉండగా 1716 పోలయ్యాయి. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి వల్లంపల్లి వినోద్‌కు 836 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి బూడిద సైదులుకు 837 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్ అభ్యర్ధన మేరకు అధికారులు రీకౌంటింగ్ నిర్వహించారు. అయినా ఓట్లలో తేడా లేక పోవడంతో సైదులు ఒక్క ఓటుతో గెలిచినట్లు ప్రకటించారు.


