పాత పద్ధతిలో యూరియా ఇవ్వాలి
పెద్దఅడిశర్లపల్లి : యారియా యాప్‌ను రద్దుచేసి పాత పద్ధతిలో రైతులకు యూరియా అందించాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు. యూరియా కొనుగోలు కోసం ప్రవేశపెట్టిన యాప్ వద్దంటూ గురువారం పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట ఎక్స్ రోడ్డు వద్ద చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రైతులు యూరియా కోసం ఇక్కట్లు పడుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత రోజులు వస్తాయన్న కేసీఆర్ మాటలు ఇప్పుడు నిజమయ్యాయని ఎద్దేవా చేశారు. రైతులకు ఇస్తానన్న రూ.15 వేల రైతు భరోసాను ప్రభుత్వం ఎగవేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వల్లపురెడ్డి, సర్పంచ్‌లు రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్, రవికుమార్, సుధాకర్ గౌడ్ పాల్గొన్నారు.


