సాగర్‌డ్యాం భద్రతపై ఇంటెలిజెన్స్‌ సమీక్ష | - | Sakshi
Sakshi News home page

సాగర్‌డ్యాం భద్రతపై ఇంటెలిజెన్స్‌ సమీక్ష

Feb 18 2026 7:10 AM | Updated on Feb 18 2026 7:10 AM

సాగర్‌డ్యాం భద్రతపై ఇంటెలిజెన్స్‌ సమీక్ష

సాగర్‌డ్యాం భద్రతపై ఇంటెలిజెన్స్‌ సమీక్ష

నాగార్జునసాగర్‌ : నాగార్జునసాగర్‌ డ్యాం భద్రతపై మంగళవారం ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారులు.. ప్రాజెక్టు అధికారులతో సమీక్షించారు. సాగర్‌లోని విజయవిహార్‌ అతిథి గృహంలో జరిగిన ఈ సమావేశంలో ప్రాజెక్టు భద్రతకు సంబంధించి ప్రస్తుతం అమలు చేస్తున్న చర్యలు, భవిష్యత్‌లో తీసుకోవాల్సిన అదనపు భద్రత చర్యలపై చర్చించారు. డ్యాం పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాల మోహరింపు, సీసీ కెమెరాల నిఘా బలోపేతం, సందర్శకుల నియంత్రణ వంటి అంశాలపై ప్రధానంగా సమీక్ష సాగినట్లు తెలిసింది. ప్రాజెక్టు నిర్వహణ, భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టం చేయాలని ఇంటెలిజెన్స్‌ అధికారులు సూచించినట్లు సమాచారం. అనంతరం అధికారులు జెన్‌కో కార్యాలయంలో విద్యుదుత్పత్తి విభాగానికి సంబంధించిన భద్రత, నిర్వహణలపై కూడా సమీక్షించారు. సమీక్ష సమావేశం అనంతరం పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తెలిపారు. డ్యాం సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ మల్లికార్జున్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమీక్షలో ఇంటెలిజెన్స్‌ బ్యూరో డీఎస్పీ హీరాలాల్‌నాయుడు, సీఐ సునీల్‌కుమార్‌, ఈఈ సీతారాం, డీఈ అశోక్‌, భద్రత అధికారి శ్రీనివాసరావు, ఏఈలు సత్యనారాయణ, విజయ్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement