రీకౌంటింగ్‌కు హైకోర్టు ఆదేశం | - | Sakshi
Sakshi News home page

రీకౌంటింగ్‌కు హైకోర్టు ఆదేశం

Feb 21 2026 6:56 AM | Updated on Feb 21 2026 6:56 AM

రీకౌం

రీకౌంటింగ్‌కు హైకోర్టు ఆదేశం

మిర్యాలగూడ టౌన్‌ : గణేష్‌పహాడ్‌ గ్రామ పంచాయతీ ఓట్లకు సంబంధించి త్వరగా రీకౌంటింగ్‌ జరిపించాలంటూ మిర్యాలగూడ కోర్టును తెలంగాణ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. దామరచర్ల మండలం గణేష్‌పహాడ్‌ సర్పంచ్‌ పదవికి రాత్ర సుక్యనాయక్‌, రాత్ర రమేష్‌నాయక్‌ పోటీ చేయగా గతేడాది డిసెంబర్‌ 14న పోలింగ్‌ జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో రమేష్‌నాయక్‌కు 477 ఓట్లు రాగా తన ప్రత్యర్థి అయిన సుక్యనాయక్‌కు 476 ఓట్లు వచ్చాయి. దీంతో ఒక్కోటు తేడాతో రమేష్‌ నాయక్‌ గెలు పొందారు. దీంతో కౌంటింగ్‌పై తనకు అనుమానంగా ఉందని, రీకౌంటింగ్‌ జరపాలంటూ రాత్ర సుక్యనాయక్‌ ఎన్నికల అధికారులను కోరినప్పటికి వారు స్పందించలేదు. దీంతో ఆయన మిర్యాలగూడ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌కోర్టులో (ఈఎల్‌ఈసీవోపీ/02/2025) కేసు వేశాడు. ఈ కోర్టు కూడా త్వరగా తేల్చడం లేదని భావించిన సుక్యనాయక్‌ 2026 జనవరి 20న హైకోర్టు(సీఆర్‌పీ/219/2026)ను ఆశ్రయించాడు. దీంతో ిపిటిషనర్‌ తరఫున హైకోర్టు సీనియర్‌ న్యాయవాది జి.కరుణాకర్‌రెడ్డి వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జువ్వాడి శ్రీదేవి త్వరగా గణేష్‌పహాడ్‌ పంచాయతీకి సంబంధించిన ఓట్లు రీకౌంటింగ్‌ చేయాలంటూ మిర్యాలగూడ కోర్టును ఆదేశించారు.

విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి

గుర్రంపోడు : ఉపాధ్యాయులు బోధనాభ్యాస సామగ్రిని విరివిగా వినియోగించి విద్యార్థులకు సులభరీతిలో అర్థమయ్యేలా విద్యాబోధన చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) బి.భిక్షపతి అన్నారు. శుక్రవారం గుర్రంపోడు మండలం కొప్పోలు జెడ్పీ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి కలిగించాలన్నారు. అనంతరం నడికూడ ప్రాథమిక పాఠశాలలో రూ.5 లక్షల వ్యయంతో తాగునీరు, ఇతర వసతులు కల్పించిన కస్తూరి ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీచరణ్‌కు జరిగిన సన్మాన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్ధార్‌ కరుణశ్రీ, ఎంఈఓ నోముల యాదగిరి, రిసోర్స్‌ పర్సన్‌లు, అన్ని పాఠశాలల హెచ్‌ఎంలు, టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ విద్యాసదస్సుకు అలీ బేగ్‌ పరిశోధన పత్రం

నల్లగొండ టూటౌన్‌ : టర్కీలో జూన్‌ 24 నుంచి 28 వరకు జరగనున్న మూడవ అంతర్జాతీయ ఆరోగ్య, వ్యా యామ విద్యా సదస్సులో మహా త్మాగాంధీ యూనివర్సిటీ చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ డాక్టర్‌ మీర్జా రాజా అలీబేగ్‌ తన పరిశోధన పత్రాన్ని సమర్పించనున్నారు. డాక్టర్‌ అలీ ‘ప్లే విత్‌ ఇన్‌ సేఫ్‌ బౌండరీస్‌ ఎంపవరింగ్‌ యూనివర్సిటీ స్పోర్ట్స్‌ త్రూ స్ట్రాటజిక్‌ సెక్యూరిటీ ప్లానింగ్‌’ అనే అంశంపై ఆయన చేసిన పరిశోధనను ఇస్టాంబుల్‌ నగరంలో జరిగే సదస్సులో సమర్పిస్తారు. యూనివర్సిటీల్లో సెక్యూరిటీ పాత్ర, స్పోర్ట్స్‌ రంగానికి సంబంధించిన అంశాలపై తాను ఈ పరిశోధన చేసినట్లు అలీ బేగ్‌ తెలిపారు.

పోస్టల్‌ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

రామగిరి (నల్లగొండ) : పోస్టర్‌ శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ సంతోష్‌కుమార్‌ నరహరి అన్నారు. శుక్రవారం నల్లగొండ మండలం నర్సింగ్‌భట్ల పోస్ట్‌ ఆఫీస్‌లో జరిగిన డాక్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ కార్యక్రమంలో భాగంగా పోస్టల్‌ స్కీంలపై గ్రామస్తులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌, సర్పంచ్‌ జాకీరా, ఉప సర్పంచ్‌ అనసూర్య, బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌ తాజుద్దీన్‌, బి.నర్సింహ, ఎం.శ్రీనివాస్‌, జి.దుర్గా భవానీ, వి.మేఘన, బి.లావణ్య, జె.కొండారెడ్డి, ఎండి.ఫయాజ్‌, హెచ్‌. విద్యాసాగర్‌, డి.సింధులహరి, యాదయ్య, యూసఫ్‌, గణేష్‌, పర్వీన్‌, లక్ష్మీనర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రీకౌంటింగ్‌కు హైకోర్టు ఆదేశం 1
1/2

రీకౌంటింగ్‌కు హైకోర్టు ఆదేశం

రీకౌంటింగ్‌కు హైకోర్టు ఆదేశం 2
2/2

రీకౌంటింగ్‌కు హైకోర్టు ఆదేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement