నిమిషం నిబంధన లేదు
ఏ రోజు చూసినా జీరో స్టాకే..
ప్రశాంతంగా పరీక్షలు రాయండి
డిండి సేఫ్టీ పనులపై నెలాఖరులోగా నివేదిక
నల్లగొండ : ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు గతంలో ఉన్న నిమిషం నిబంధనను ఇంటర్ బోర్డు ఎత్తి వేసింది. నిమిషం నిబంధన కారణంగా గతంలో చాలా మంది విద్యార్థులు పరీక్షలు రాయలేక నష్టపోయారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఆ నిబంధనను ఎత్తి వేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) దస్రూ తెలిపారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఏర్పాట్లపై శుక్రవారం ఆయన సాక్షి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు మొత్తం 45 కేంద్రాలు కేటాయించడంతోపాటు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. విద్యార్ధులు పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని సూచించారు. పరీక్షల ఏర్పాట్లపై ఆయన మాటల్లోనే..
25న పరీక్షలు ప్రారంభం
ఈ నెల 25 నుంచి వచ్చే నెల మార్చి 18వ తేదీ వరకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లాలో మొదటి సంవత్సరం విద్యార్ధులు జనరల్ కేటగిరీలో 11,802, ఒకేషనల్ 2,117 మంది పరీక్షకు హాజరు కానున్నారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో 11,733 మంది జనరల్, 2,248 మంది ఒకేషనల్ విభాగాల విద్యార్థులు హాజరవుతారు.
పరీక్షల నిర్వహణకు కమిటీలు,
ప్రత్యేక బృందాలు
పరీక్షల నిర్వహణకోసం డీఈసీ కమిటీతోపాటు హైలెవల్ కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీలో కలెక్టర్ చైర్మన్‌గా, డీఐఈఓ కన్వీనర్‌గా, ఎస్పీ సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలో ఇద్దరు సీనియర్ ప్రిన్సిపాళ్లతోపాటు మరో ఇద్దరి ప్రిన్సిపాళ్లతో డీఈసీ కమిటీని ఏర్పాటు చేశాం. పరీక్షల పర్యవేక్షణకు రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, మూడు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశాం.
పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు..
పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాం. తాగునీటితోపాటు విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటారు. ఒక్కో సెంటర్‌లో మెడికల్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ నిఘాలో పరీక్షలు కొసాగుతాయి. జిల్లాకు వచ్చిన ప్రశ్నపత్రాలను పోలీస్ స్టేషన్లలో భద్రపరిచాం. పోలీస్ బందోబస్తు నడుమ ప్రశ్నపత్రాలను పరీక్ష రోజు కేంద్రాలకు తరలిస్తాం. పరీక్ష ముగసిన తరువాత ఎస్కార్ట్ బందోబస్తు నడమ తరలిస్తాం. జిల్లా అంతటా పరీక్ష కేంద్రాల వద్ద 44 సెక్షన్ అమలులో ఉంటుంది. పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలి.
ఈయన రొమ్ముల రాంబాబు. మాడ్గులపల్లి మండలం పూసలపాడుకు చెందిన ఈయన ఫర్టిలైజర్ యాప్‌తో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. సెల్‌ఫోన్‌లో యూరియా బుక్ చేసుకుందామని ఓపెన్ చేసిన ఆరు సెకన్లలోపే స్టాక్ లేదని చూపిస్తోందని అంటున్నారు. పంటకు సరైన సమయంలో యూరియా వేయకపోతే దెబ్బతిని నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. జిల్లాలో వీరే కాదు.. ఈ యాసంగి సీజన్‌లో వరిసాగు చేసిన రైతులు యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నారు.
మునుగోడుకు చెందిన ఈ రైతు పేరు మధుసూదన్‌రెడ్డి. తనకు చదువు రాదని, యూరియా
ఎలా బుక్ చేసుకోవాలని వాపోతున్నారు. ఎవరితోనైనా చేయిద్దామంటే యాప్‌లో యూనియా లేనట్లుగా చూపిస్తోందని చెబుతున్నారు. యూరియా కోసం ఆత్మహత్య చేసుకోవాలా? అని ప్రశ్నిస్తూ శుక్రవారం స్థానికంగా ఓ ఫర్టిలైజర్ షాపు వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.
ఈయన చిలుక ప్రతాప్‌రెడ్డి. ఈయనది త్రిపురారం మండలం జీఅన్నారం గ్రామం. 20 రోజుల నుంచి యూరియా బుక్ చేస్తున్నా దొరకడం లేదంటున్నారు. అసలు మండలానికి యూరియా వస్తుందో రావడంలేదో కూడా అర్థం కావడం లేదని చెబుతున్నారు. వరిపొలం పొట్ట దళకు వచ్చే సమయంలో యూరియా దొరక్క వేయకపోతే పంట పండుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రైతులకు యూరియాను అందుబాటులో ఉంచడంలో యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫర్టిలైజర్ యాప్‌లో యూరియా బుక్ చేసుకునేందుకు రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. రైతుల్లో చాలా మందికి స్మార్ట్ ఫోన్లు లేక, ఫోన్లు ఉన్నా చదువురాని వారు బుక్ చేసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీసేవ కేంద్రాల్లోకి వెళ్లి, లేదా మరెవరితోనైనా బుక్ చేయిద్దామని వెళ్లి యాప్‌ను ఓపెన్ చేసిచూస్తే యూరియా స్టాక్ లేనట్లే చూపుతోంది. ఎప్పు డు చూసినా యూరియా బుక్ కావడం లేదని, తమ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో జీరో చూపిస్తోందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్బందులను అధిగమించాలని..
గత వానాకాలం సీజన్‌లో తలెత్తిన ఇబ్బందులను అఽధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫర్టిలైజర్ యాప్‌ను తెచ్చింది. సీజన్ ఆరంభంలో నాన్ ఆయకట్టులో ఎలాగోలా రైతులు ఫర్టిలైజర్ యాప్‌లో యూరియాను బుక్ చేసుకుంటే ఎకరానికి రెండు బస్తాలు మాత్రమే ఇచ్చారు. ఆ తరువాత 15 రోజులకు మళ్లీ బుక్ చేసుకుందామంటే దొరకడం లేదని వాపోతున్నారు. మరోవైపు ఆయకట్టు ప్రాంతంలోనూ గత నెలలో నాట్లు వేసిన రైతులు యూ రియా కోసం నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
అవసరం మేరకు రాని యూరియా
జిల్లాలో యాసంగి సీజన్‌లో 5.45 లక్షల ఎకరాల్లో వరితోపాటు ఇతర పంటలను రైతులు సాగు చేశారు. ఈ సీజన్‌లో 74,955 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. అయితే జిల్లాలో గత వానాకాలం సీజన్ ముగింపు సమయమైన అక్టోబర్ నుంచి ఇప్పటివరకు జిల్లాకు 64,797 మెట్రిక్ టన్నుల యూరియా ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నా రైతులకు మాత్రం దొరకడం లేదు.
ఇష్టానుసారంగా కేటాయింపులు
సహకార సంఘాలకు, డీలర్లకు యూరియాను మార్క్‌ఫెడ్ కేటాయిస్తుంది. అందులో సంఘాలకు 60 శాతం, డీలర్లకు 40 శాతం ఇస్తారు. మార్క్‌ఫెడ్ అధికారులు ఆ 40 శాతం యూరియాను వారికి అనుకూలంగా ఉన్న డీలర్లకే కేటాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. యారియా అలాట్ కాగానే ఆయా డీలర్లు తమ రెగ్యులర్ రైతులకు ముందుగానే సమాచారం ఇవ్వడం, మరోవైపు డీలర్లే రైతుల పేరుతో బుక్ చేస్తున్నారు. దీంతో మిగతా రైతులకు యూరియా దొరకడం లేదు.
ఫ సీడీఎస్‌ఈ కమిటీ చెర్మన్ రామరాజు
ఫ ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరు
అయ్యేందుకు 5 నిమిషాలు సడలింపు
ఫ 25 నుంచి మార్చి 18వ తేదీ వరకు పరీక్షల నిర్వహణ
ఫ 45 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి
ఫ జిల్లా వ్యాప్తంగా హాజరుకానున్న 27,714 మంది విద్యార్థులు
‘సాక్షి’తో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి దస్రూ
రైతులు యూరియా కోసం సెల్‌ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని యూరియా బుక్ చేద్దామనుకున్న ప్రతిసారి జీరో స్టాక్ చూపిస్తోంది. జిల్లాలో గురువారం 2502 బస్తాలు ఉన్నట్లు చూపినా నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలోని ఏ మండలంలో కూడా యూరియా లేదు. శుక్రవారం అదే పరిస్థితి నెలకొంది. ఇక్కడే మిగితా నియోజవకర్గాల్లోని మండలాల్లో చూసినా యూరియా దొరకడం లేదని రైతులు వాపోతున్నారు.
ఫ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌తో
రైతుల ఆగచాట్లు
ఫ ఎప్పుడు ఓపెన్ చేసినా ఆన్‌లైన్‌లో కనిపించని స్టాక్
ఫ స్మార్ట్‌ఫోన్లు లేక, బుక్ చేసుకోవడం తెలియక చాలామంది తిప్పలు
ఫ యూరియా అందుబాటులో
ఉంచడంలో యంత్రాంగం విఫలం
ఫ యాసంగి సీజన్ వరికి అదును దాటుతోందని కర్షకుల ఆవేదన
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం అన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు నడుపుతున్నాం. విద్యార్ధులు ఎవరైనా దివ్యాంగులు (బ్లైండ్) ఉంటే వారికి బదులుగా మరొకరు పరీక్ష రాసేందుకు ముందే దరఖాస్తు చేసుకోవాలి. హాల్‌టికెట్లు ఇప్పటికే కళాశాలలకు చేరాయి. ఎవరైనా ప్రైవేటు కళాశాల వారు హాల్‌టికెట్లు ఇవ్వకుంటే ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దానిమీద ప్రిన్సిపాల్ సంతకం కూడా అవసరం లేదు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, ఆందోళనలకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి.
నిమిషం నిబంధన లేదు
నిమిషం నిబంధన లేదు
నిమిషం నిబంధన లేదు
నిమిషం నిబంధన లేదు
నిమిషం నిబంధన లేదు
నిమిషం నిబంధన లేదు
నిమిషం నిబంధన లేదు


