పర్యాటకం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
నల్లగొండ : జిల్లాలో సహజ, ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాధాన్యత గల ప్రదేశాలను గుర్తించి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సమగ్ర మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో టూరిజంపై నిర్వహించిన సమావేశంలో పచ్చల, ఛాయాసోమేశ్వర, పాలెం లక్ష్మీనరసింహస్వామి ఆలయాలు, లతీఫ్ సాహెబ్, కాపురాల గుట్టలపైకి రోప్‌వే ఏర్పాటు, డిండి ప్రాజెక్టు వద్ద బోటింగ్ సదుపాయాల విస్తరణ, దేవరచర్ల శివాలయం, కాచరాజుపల్లి ఏలేశ్వరం, ఏకేబీఆర్, అజ్జలాపురం జలపాతం, అలాగే నెల్లికల్లు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలను అభివృద్ధి చేసే విషయమై సమీక్షించారు. ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేసి స్థానిక యువతకు గైడ్స్, హోం స్టేలు, ఫుడ్ కోర్టులు, హస్తకళల విక్రయ కేంద్రాలు, ట్రాన్స్‌పోర్ట్ సదుపాయాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. సమావేశంలో సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఏఎస్పీ రమేష్, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, చండూరు ఆర్డీఓ శ్రీదేవి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా యువజన క్రీడల అధికారి అక్బర్ అలీ, బుద్ధవనం ఇన్‌చార్జి శ్యాంసుందర్, టూరిజం, అటవీ, ఆర్కియాలజీ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లా ప్రగతికి సహకరించాలి
పారిశ్రామిక సంస్థలు, రైస్ మిల్లర్లు, వాణిజ్య బ్యాంకులు.. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద జిల్లా అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని రంగాల్లో మాత్రమే పారిశ్రామిక సంస్థలు, ఇతరులు సీఎస్‌ఆర్ నిధులు అందజేయడం వల్ల ఒక ప్రాంతమే అభివృద్ధి చెందుతుందని, అలా కాకుండా జిల్లా మొత్తంగా అభివృద్ధి జరిగేలా చూడాలన్నారు. ఈ విషయమై ఇటీవలే సీఎస్ ఆర్ జిలా కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సహకారం అందిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ సతీష్, పారిశ్రామిక సంస్థల ప్రతిని ధులు, రైస్ మిల్లర్లు, బ్యాంకర్లు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


