పీఆర్‌కే రెడ్డి గ్రీన్‌ విల్లాస్‌ ఎన్‌క్లేవ్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

పీఆర్‌కే రెడ్డి గ్రీన్‌ విల్లాస్‌ ఎన్‌క్లేవ్‌ ప్రారంభం

Feb 23 2026 7:11 AM | Updated on Feb 23 2026 7:11 AM

పీఆర్‌కే రెడ్డి గ్రీన్‌ విల్లాస్‌ ఎన్‌క్లేవ్‌ ప్రారంభం

పీఆర్‌కే రెడ్డి గ్రీన్‌ విల్లాస్‌ ఎన్‌క్లేవ్‌ ప్రారంభం

నల్లగొండ టౌన్‌: నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని చర్లపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన పీఆర్‌కే రెడ్డి గ్రీన్‌ విల్లాస్‌ ఎన్‌క్లేవ్‌ వెంచర్‌ను ఆదివారం సింగర్‌ మధుప్రియ, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా బుర్రి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. నల్ల గొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో శ్రీరామకృష్ణ బిల్డర్స్‌ అండ్‌ డెవలపర్స్‌ ఆధ్వర్యంలో అత్యున్నత ప్రమాణాలతో పీఆర్‌కే రెడ్డి గ్రీన్‌ విల్లాస్‌ ఎన్‌క్లేవ్‌ వెంచర్‌ రూపుదిద్దుకుందని అన్నారు. ఈ వెంచర్‌లో ప్లాట్లు, గృహాలు ప్రజలు కొనుగోలు చేసి తమ సొంతింటి కలను నెరవేర్చుకోవాలన్నారు. అనంతరం బ్రోచర్‌ను ఆవిష్కరించారు. వెంచర్‌ నిర్వాహకుడు బాలాజీనాయక్‌ మాట్లాడుతూ.. ఈ వెంచర్‌ డీటీసీపీ, రెరా వంటి అన్నిరకాల అనుమతులు పొందిందన్నారు. విశాలమైన రోడ్లు, ఎలక్ట్రిసిటీ, వాటర్‌ సప్లై ఉన్నాయని, ఆహ్లాదకర వాతావరణంలో కొనుగోలుదారులకు నచ్చినట్లుగా ఇల్లు నిర్మించి ఇవ్వనున్నట్లు తెలిపారు. సింగర్‌ మధుప్రియ పాడిన పాటలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు గుమ్మల మోహన్‌రెడ్డి, హైకోర్టు అడ్వకేట్‌ పి. రామకృష్ణారెడ్డి, బొజ్జ శంకర్‌, శ్రీధర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రేగట్టె నవీన్‌కుమార్‌రెడ్డి, అనంతరెడ్డి, జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement