సామిల్లు నిర్వహణ నుంచి చైర్‌పర్సన్‌గా.. | - | Sakshi
Sakshi News home page

సామిల్లు నిర్వహణ నుంచి చైర్‌పర్సన్‌గా..

Feb 16 2026 7:20 AM | Updated on Feb 16 2026 7:20 AM

సామిల్లు నిర్వహణ నుంచి చైర్‌పర్సన్‌గా..

సామిల్లు నిర్వహణ నుంచి చైర్‌పర్సన్‌గా..

ఆలేరు: నిన్నమొన్నటి వరకు ఆమె తన భర్తతో కలిసి సామిల్లు(కట్టకోత మిషన్‌) నిర్వహించేది. పెద్దగా రాజకీయ నేపథ్యం కూడా లేదు. కానీ మున్సిపల్‌ ఎన్నికల రూపంలో అదృష్టం కలిసొచ్చి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి ఆమెను వరించింది. ఆలేరు మున్సిపల్‌ తొలి మహిళా చైర్‌పర్సన్‌గా బీజన బాలమణి పగ్గాలు చేపట్టనున్నారు. 7వ వార్డు నుంచి బాలమణి కౌన్సిలర్‌గా విజయం సాధించగా.. ఆమెతో పాటు ఏడుగురు కాంగ్రెస్‌ అభ్యర్థులు కౌన్సిలర్లుగా గెలిచారు. మ్యాజిక్‌ ఫిగర్‌ రావడం, చైర్‌పర్సన్‌ పదవి బీసీ మహిళకు రిజర్వు కావడంతో బాలమణిని చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అధికారికంగా ప్రకటించారు. దీంతో సోమవారం బాలమణి చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

బాలమణి కుటుంబ నేపథ్యం ఇదీ..

బాలమణి రాజాపేట ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి వరకు చదువుకుంది. ఆలేరుకు చెందిన బీజన భాస్కర్‌తో ఆమె వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు కార్తీక్‌, సాయితేజ ఉన్నారు. భర్త భాస్కర్‌తో కలిసి ఆమె సామిల్లు వ్యాపారం నిర్వహిస్తుందిది. బాలమణి భర్త భాస్కర్‌ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సోదరుడు బీర్ల శంకర్‌కు స్వయానా సడ్డకుడు.

ఆలేరు మున్సిపల్‌ తొలి మహిళా

చైర్‌పర్సన్‌ బాలమణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement