చెట్టు పట్టాలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా
● ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
మర్రిగూడ : మండలంలోని ఖుదాబక్షపల్లిలో పేద రైతులకు సంబంధించిన చెట్టు పట్టాల సమస్య గురించి శాసనమండలిలో ప్రస్తావించి పరిష్కారానికి కృషిచేస్తానని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఆదివారం ఖుదాబాక్షపల్లి గ్రామంలో నిర్వహించిన సీపీఐ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఖుదాబక్షపల్లిలో 70ఏళ్ల క్రితం గుట్ట ప్రాంతంలో పేద రైతులకు ఇచ్చిన చెట్టు పట్టాలను రద్దుచేయకుండా పోరాడుతానన్నారు. గ్రామంలో మౌలిక వసతులు కల్పించేలా స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. అనంతరం రాంరెడ్డిపల్లి పరిధిలోని తానేదార్‌పల్లికి చెందిన సీపీఐ కార్యదర్శి కర్నాటి అంజయ్య తల్లి చంద్రమ్మ ఇటీవల మృతిచెందగా ఎమ్మెల్సీ ఆ గ్రామానికి వెళ్లి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఈదుల భిక్షంరెడ్డి, మండల కన్వీనర్ బుర్ర శేఖర్, మేతరి యాదయ్య, పొట్ట అశోక్, గిరి ముత్తయ్య, ఎరుకల నిరంజన్‌గౌడ్, అబ్బనగోని కృష్ణయ్య, జాల చంద్రయ్య, పాముల రమేష్, అడమయ్య, కొమురయ్య పాల్గొన్నారు.


