హెచ్‌పీవీ టీకాలు ఎప్పుడో..!
ప్రభుత్వం నుంచి హెచ్‌పీవీ టీకాలు సరఫరా కాగానే బాలికలకు వాటిని వేసే కార్యక్రమం ప్రారంభిస్తాం. ఇప్పటికే మెడికల్ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలకు అవగాహన కల్పించాం. టీకాలు రాగానే వేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నాం.
– డాక్టర్ పుట్ల శ్రీనివాస్,
డీఎంహెచ్‌వో, నల్లగొండ
నల్లగొండ టౌన్ : మహిళలను వేధిస్తున్న క్యాన్సర్ మహమ్మారిని అరికట్టేందుకు యుక్త వయసు అమ్మాయిలకు హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సిన్ వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఏటా వేలాది మంది యుక్త వయసు అమ్మాయిల నుంచి వృద్ధాప్యంలో ఉన్న మహిళలను క్యాన్సర్ పట్టి పీడిస్తోంది. రొమ్ము, గర్బాశయ ముఖ ద్వార క్యాన్సర్ బారిన పడి చాలా మంది చనిపోతున్నారు. ఈ నేపధ్యంలో క్యాన్సర్ మహమ్మారిని సమూలంగా నిరోదించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు యుక్త వయసు గల బాలికలకు (14 –15) టీకాలు వేయాలని సంకల్పించాయి. అందులో బాగంగా జిల్లాలో జనవరి మొదటి వారం నుంచి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హెచ్‌పీవీ టీకాలను వేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పీహెచ్‌సీల మెడికల్ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలకు హెచ్‌పీవీ టీకాలను వేసేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించింది. కానీ ఇప్పటి వరకు జిల్లాకు హెచ్‌పీవీ టీకాలను రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయలేదు.
20 వేల మంది అర్హులు..
హెచ్‌పీవీ టీకాలకు జిల్లాలోని హైస్కూళ్లు, వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న కిషోర బాలికలు (14–15 సంవత్సరాల) 20 వేల మంది ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. టీకాలను ప్రభుత్వం సరఫరా చేసిన వెంటనే వీరందరికి టీకాలను వేయనున్నారు.
ఫ యుక్త వయసు అమ్మాయిలకు వ్యాక్సిన్ వేయాలని నిర్ణయం
ఫ జిల్లాలో 20 వేల మంది
అర్హుల గుర్తింపు
ఫ టీకాల సరఫరా లేకపోవడంతో వ్యాక్సినేషన్‌లో జాప్యం
హెచ్‌పీవీ టీకాలు ఎప్పుడో..!


