దైవ దర్శనానికి వెళ్లొస్తూ మృత్యు ఒడికి.. | - | Sakshi
Sakshi News home page

దైవ దర్శనానికి వెళ్లొస్తూ మృత్యు ఒడికి..

Feb 18 2026 6:54 AM | Updated on Feb 18 2026 6:54 AM

దైవ ద

దైవ దర్శనానికి వెళ్లొస్తూ మృత్యు ఒడికి..

హాలియా : పెద్దవూర మండలం బట్టుగూడెంలో శివరాత్రి ఉత్సవాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుని వస్తూ రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు మృతి చెందారు. ఈ సంఘటన హాలియా పట్టణంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. సీఐ సతీష్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన పిట్టల వెంకటయ్య (50), పిట్టల మల్లమ్మ (45) ఇరువురు భార్యభర్తలు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు కాగా అందరి వివాహాలు కావడంతో మూడేళ్ల క్రితం అనుముల మండలం కొట్టాల గ్రామానికి బతుకుదెరువు కోసం వచ్చారు. గ్రామంలో తమ పేర ఉన్న రెండు ఎకరాలకుతోడు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పెద్దవూర మండలం బట్టుగూడెంలో జరిగిన శివరాత్రి ఉత్సవాలను చూసేందుకు మంగళవారం ఉదయం భార్యభర్తలు ఇద్దరు టీవీఎస్‌ వాహనంపై వెళ్లారు. శివాలయంలో స్వామిని దర్శనం చేసుకున్న అనంతరం ఈ దంపతులు సాయంత్రం కొట్టాలకు బయలుదేరారు. మార్గమధ్యలో హాలియా సమీపంలోని ఎడమ కాల్వ బ్రిడ్జిపై వీరి ద్విచక్ర వాహనాన్ని పెద్దవూర నుంచి హాలియా వైపు వస్తున్న లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. వాహనంపై నుంచి భార్యభర్తలు ఇరువురు రోడ్డుపై పడడంతో లారీ డ్రైవర్‌ చూసుకోకుండా వారి మీదనుంచి లారీని పోనిచ్చాడు. దీంతో భార్యభర్తల ఇద్దరి తలలు పగిలి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న సీఐ సతీష్‌రెడ్డి, పోలీస్‌ సిబ్బందితో ఘటన స్థలం వద్దకు చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సాగర్‌ కమలానెహ్రూ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.

కట్టంగూర్‌ శివారులో

జార్ఖండ్‌ వాసి మృతి

కట్టంగూర్‌ : కట్టంగూర్‌ గ్రామ శివారులో జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్‌ రాష్ట్రం రాంచీ జిల్లా జార్గో మండలం దానుముండా గ్రామానికి చెందిన బెలాసి సాధికా ముండా(26) తన భార్య బెలాసి కుమారితో కలిసి భువనేశ్వర్‌ నుంచి హైదరాబాద్‌కు ఈ నెల 16 మధ్యాహ్నం ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులో బయలుదేరాడు. మంగళవారం ఉదయం కట్టంగూర్‌ గ్రామ శివారులోకి రాగానే సాధికా ముండా బస్సు డ్రైవర్‌ వద్దకు వెళ్లి మూత్రం పోసివస్తానని చెప్పి కిందికి దిగి బస్సు వెనకవైపునకు వెళ్లి రోడ్డు దాటుతుండగా విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న డీసీఎం కంటెనయిర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం టైర్ల కింద పడిన సాధికా ముండా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతిడికి అదే గ్రామానికి చెందిన కుమారితో సంవత్సరం క్రితం వివాహం జరిగింది. కాగా మృతుడు ఆరేళ్లుగా చౌటుప్పల్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నకిరేకల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య బెలాసి కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ మునుగోటి రవీందర్‌ తెలిపారు.

ఫ శివాలయానికి వెళ్లివస్తున్న

భార్యభర్తలను ఢీకొట్టిన లారీ

ఫ అక్కడికక్కడే మృతిచెందిన దంపతులు

ఫ హాలియా పట్టణంలో ఘటన

దైవ దర్శనానికి వెళ్లొస్తూ మృత్యు ఒడికి..1
1/2

దైవ దర్శనానికి వెళ్లొస్తూ మృత్యు ఒడికి..

దైవ దర్శనానికి వెళ్లొస్తూ మృత్యు ఒడికి..2
2/2

దైవ దర్శనానికి వెళ్లొస్తూ మృత్యు ఒడికి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement