మురళీకృష్ణుడిగా నారసింహుడు
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు ఆదివారం ఉదయం ఆలయంలో నిత్యారాధనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామిని మురళీకృష్ణుడిగా అలంకరించి పల్లకీపై అధిష్టింపజేసి మాడ వీధిలో ఊరేగించారు. ఆ తర్వాత తూర్పు మాడ వీధిలో వేంచేపు చేసి వేద పారాయణం పఠించారు. అనంతరం మురళీకృష్ణుడికి రాగాలాపన చేశారు. ఈ వేడుకల్లో కలెక్టర్ హనుమంతరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటచార్యులు, భట్టర్ సురేంద్రాచార్యులు, ఆలయాధికారులు, అర్చకులు, పారాయణీకులు, భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం నిత్యారాధనలు వైభవంగా జరిగాయి. అనంతరం స్వామివారిని పొన్న వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు.
ఉత్సవాల్లో నేడు..
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం గోవర్ధనగిరిధారి అలంకార సేవ, రాత్రి సింహ వాహన సేవ నిర్వహించనున్నారు.
పొన్న వాహనంపై
దర్శనమిచ్చిన స్వామివారు
మురళీకృష్ణుడిగా నారసింహుడు
మురళీకృష్ణుడిగా నారసింహుడు


