కౌంటింగ్ విధులు ముగించుకుని వెళ్తుండగా..
ఫ రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం
రామగిరి(నల్లగొండ): మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ డ్యూటీకి హాజరై వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతిచెందాడు. ఈ ఘటన శుక్రవారం నల్లగొండ మండలం చందనపల్లి వద్ద జరిగింది. నకిరేకల్‌కు చెందిన షేక్ తయ్యుబ్(34) మునుగోడు పోలీస్ స్టేషల్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ డ్యూటీ నిమిత్తం శుక్రవారం నల్లగొండకు వచ్చాడు. విధులు ముగించుకుని బైక్‌పై నకిరేకల్ వెళ్తుండగా నల్లగొండ మండలం చందనపల్లి వద్ద ఎదురుగా వస్తున్న డీసీఎం తయ్యుబ్ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.
చికిత్స పొందుతూ యువకుడు మృతి
కేతేపల్లి: పెళ్లి కావడం లేదని మనస్తాపంతో పురుగుల మందు తాగిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన బత్తుల సతీష్‌రెడ్డి(30) వ్యవసాయంతో పాటు ట్రాక్టర్లు, వరికోత మిషన్‌ల డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం కసాగిస్తున్నాడు. తనకు పెళ్లి కావడం లేదని మనస్తాపం చెందిన సతీష్‌రెడ్డి ఈ నెల 3న కేతేపల్లి నుంచి కొత్తపేటకు వెళ్లే దారిలో శ్మశానవాటిక సమీపంలో పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సతీష్‌ను సూర్యాపేట ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. సతీష్‌రెడ్డికి తల్లి, సోదరి ఉన్నారు. మృతుడి తల్లి రాములమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సతీష్ మృతదేహానికి నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించినట్లు కేతేపల్లి హెడ్ కానిస్టేబుల్ వి. అనిల్‌రెడ్డి తెలిపారు.


