మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా | - | Sakshi
Sakshi News home page

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా

Feb 23 2026 7:11 AM | Updated on Feb 23 2026 7:11 AM

మత సా

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా

మర్రిగూడ (చింతపల్లి) : మత సామరస్యానికి ప్రతీక సయ్యద్‌ హజరత్‌ అబ్బాస్‌ దర్గా అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. ఆదివారం చింతపల్లి మండలం పీకే మల్లేపల్లిలోని దర్గాలో వారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వారిని దర్గా నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆలిండియా వాలీబాల్‌ పోటీలకు కానిస్టేబుల్‌ ఎంపిక

కనగల్‌ : కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఈ నెల 23 నుంచి 27 వరకు జరిగే ఆలిండియా 74వ పోలీస్‌ జాతీయ వాలీబాల్‌ క్లస్టర్‌ పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరఫున కనగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మ బేబీశాలిని ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన స్టేట్‌ ఫోర్త్‌ సమ్మిట్‌ సైబరాబాద్‌ వాలీబాల్‌ మహిళా విభాగం పోటీల్లో బేబీశాలిని పాల్గొని ఎంపికై ంది. ఈమె స్వగ్రామం చింతపల్లి మండలం వింజమూరు. జాతీయ పోటీలకు ఎంపికై న బేబీ శాలినిని చండూరు సీఐ కె.ఆదిరెడ్డి, కనగల్‌ ఎస్‌ఐ రాజీవ్‌రెడ్డి అభినందించారు.

కాంట్రాక్టు సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి

నల్లగొండ టౌన్‌ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులరైజ్‌ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం నల్లగొండలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆసుపత్రి కార్మికుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కార్మికులుగా పనిచేస్తున్న వారు నేటికీ శ్రమదోపిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఏజెన్సీల విధానం రద్దుచేసి కార్పొరేషన్‌ ద్వారా నేరుగా కార్మికులకు జీతభత్యాల అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. మెడికల్‌ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఈ నెల 28న ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వరంగల్‌లో జరగనున్న సభకు కార్మికులు అధిక సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో విశ్వనాథులు లెనిన్‌, యాదగిరి, ిసీహెచ్‌.నిర్మల, పి.ఎల్లమ్మ, పద్మ, రామేశ్వరమ్మ, అన్నపు లింగస్వామి, సందీప్‌, మధు, సబిత, నిర్మల, ఉషమ్మ, యాదమ్మ పాల్గొన్నారు.

మట్టపల్లిలో విశేష పూజలు

మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం స్వామివారికి అర్చకులు విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహస్వామికి సుప్రభాతసేవ, హోమశాలలో నిత్యఅగ్నిహోత్రి, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం గోదాదేవికి, ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్లలను పట్టు వస్త్రాలంకరణతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవారి నిత్య కల్యాణాన్ని చేపట్టారు. అనంతరం నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్‌, ఈఓ బి.జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు.

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా1
1/3

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా2
2/3

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా3
3/3

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement