రామప్ప సమీపంలో ఓపెన్‌కాస్ట్‌.. ఆపకుంటే ఉద్యమమే: కేటీఆర్‌ | KTR warns against setting up an open cast mine near Ramappa | Sakshi
Sakshi News home page

రామప్ప సమీపంలో ఓపెన్‌కాస్ట్‌.. ఆపకుంటే ఉద్యమమే: కేటీఆర్‌

Oct 5 2026 3:04 PM | Updated on Oct 5 2026 3:18 PM

KTR warns against setting up an open cast mine near Ramappa

సాక్షి, ములుగు: ప్రఖ్యాత దేవాలయం రామప్పకు సమీపంలో ఓపెన్‌ కాస్ట్‌ గని ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయం పరిసరాల్లో బొగ్గుగని ప్రతిపాదన వెంటనే వెనక్కు తీసుకోవాలన్నారు. లేకపోతే రామప్ప వారసత్వ సంపదకు ముప్పుు వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఈ మాటలు పట్టించుకోకుండా ఆలయానికి హాని చేసే ప్రయత్నాలు చేస్తే పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని కేటీఆర్‌ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.

కాగా ములుగు జిల్లా, వెంకటాపూర్ గ్రామ పరిధిలో ఓపెన్ కాస్ట్ఏర్పాటు చేయడానికి సింగరేణి సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ గని ద్వారా దాదాపు 300 మీటర్ల లోతు వరకు తవ్వకాలు జరపాలని నిర్ణయించారు. దీనివల్ల రామప్ప దేవాలయం ప్రత్యేకమైన 'శాండ్‌బాక్స్' (ఇసుక) ఫౌండేషన్‌కు, రామప్ప చెరువు నీటి నిల్వలకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని నిపుణులు, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ (KHT) ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

సుమారు 5 కిలోమీటర్ల దిగువన ఉండే ఈ మైనింగ్ కారణంగా భూగర్భ జలాల ప్రవాహం మారి, చెరువు నుంచి నీరు కారే ప్రమాదం ఉందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) నివేదికలు హెచ్చరించాయి. ఈ ప్రాజెక్ట్‌ను నిలిపివేయాలని కోరుతూ కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యులు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే స్థానిక గ్రామాల ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై కేటీఆర్‌ స్పందించారు. 

ఇదీ చదవండి: స్పెయిన్‌ ప్రధాని సంచలన నిర్ణయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement