మాకు ఏ భేషజాలు లేవు | Minister komatireddy venkat reddy reacts on kodad road accident | Sakshi
Sakshi News home page

మాకు ఏ భేషజాలు లేవు

Aug 28 2026 6:06 AM | Updated on Aug 28 2026 6:06 AM

Minister komatireddy venkat reddy reacts on kodad road accident

సమీక్షలో వివరాలు తెలుసుకుంటున్న మంత్రి కోమటిరెడ్డి

రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానినీ కలుస్తాం 

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: హై­దరాబాద్‌–­విజయవాడ రహదారిపై నిత్యం జరు­గు­తున్న ప్రమాదాలతో ఇప్పటికే వేల మంది ప్రా­ణాలను కోల్పోయా­రని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని రోడ్లు, జాతీయ రహదారుల ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి గురు వారం సమీక్షించారు. ఈ సందర్భంగా కోదాడ వద్ద జరి­గిన బస్సు ప్ర­మాదంతో పాటు ఇటీవల జరిగిన పలు ప్రమా­దాలపై మంత్రి ఆరా తీశారు. హైదరాబాద్‌–విజయవాడ రహ­దారిలో గుర్తించిన 17 బ్లాక్‌ స్పాట్స్‌పై నిర్మి­స్తున్న ఫ్లైఓవర్లు, హైమాస్క్‌ లైట్స్‌ పనుల పురోగతిని తెలుసుకున్నారు.

 చిట్యాల ఫ్లైఓవర్‌ ఈ దసరా నాటికి పూర్తిచేయాలని, మిగ­తా­వి డిసెంబర్‌ చివరి నాటికి అందుబాటులోకి తేవాలని మంత్రి ఆదేశించారు. 6+2 రహదారి విస్తరణ కోసం ఇప్పటికే కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని పలు­మార్లు కలిశామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే తమ ధ్యేయ­మ­ని, అందుకోసం తమకు ఎలాంటి భేషజాలు లేవు అని మంత్రి స్పష్టం చేశా­రు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులతో కలిసి మరో­సారి నితిన్‌ గడ్కరీని.. అవసరమైతే ప్రధానమంత్రిని కలుస్తామ­న్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement