భవనాన్ని లీజుకు కోరిన తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ
స్పందించకపోవడంపై మంత్రి పేషీ తీవ్ర ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: కార్యాలయ భవనాన్ని అద్దెకిచ్చేందుకు ఏపీ చలనచిత్ర అభివృద్ధి కార్పొరేషన్ సిద్ధమైంది. మాసాబ్‌ట్యాంక్‌లోని 42 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కార్యాలయం అద్దె లేదా లీజు ప్రాతిపది కన ఇచ్చేందుకు కార్యాలయ ఆవరణలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. ఈ ఫ్లెక్సీ ఏర్పాటు, అద్దె కిచ్చే నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వ శాఖలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కార్యా లయ భవనాలు తెలంగాణ పరిధిలో ఉండగా.. ఏపీ అధికారులు లీజు/అద్దెకు ఇవ్వ డాన్ని ఆక్షేపిస్తున్నాయి. ఇదిలావుండగా... అద్దె కోసం బీసీ సంక్షేమ శాఖ ఏపీఎఫ్‌డీసీని సంప్రదించింది.
తమకు అద్దెకు ఇవ్వాలని ప్రతిపాదించి ప్రత్యేకంగా లేఖలు సమర్పించింది. కానీ ఏపీఎఫ్‌డీసీ స్పందించలేదు. దీంతో ఈ అంశా న్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లిన అధికారులు... ప్రత్యామ్నా య ఏర్పాట్లపై దృష్టి సారించారు. అద్దె విషయంలో ఆగ్రహించిన కొందరు ఏకంగా ఫ్లెక్సీలోని కాంటాక్టు నంబర్లను తొలగిస్తూ... ఆమేరకు ఫ్లెక్సీని కత్తిరించడం కొసమెరుపు.


