హైదరాబాద్‌ మూలాలున్న ఇద్దరు మిస్సింగ్‌ | Two people with Hyderabad roots missing | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ మూలాలున్న ఇద్దరు మిస్సింగ్‌

Aug 28 2026 5:11 AM | Updated on Aug 28 2026 5:11 AM

Two people with Hyderabad roots missing

అమెరికాలో స్థిరపడిన లక్ష్మీనాథ్‌

న్యూజిలాండ్‌ పౌరసత్వం కలిగిన సుహాసినిరెడ్డి  

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్‌/నాగోలు/మునుగోడు: నేపాల్‌ వరదల్లో హైదరాబాద్‌ ఎల్‌బీనగర్‌ వాస్తు కాలనీకి చెందిన కందిమళ్ల మహేందర్‌రెడ్డి–ప్రేమలతా రెడ్డిల కూతురు సుహాసినిరెడ్డి (44) గల్లంతయ్యా రు. నల్లగొండ జిల్లా పెద్దకాపర్తికి చెందిన మహేందర్‌రెడ్డి పెద్ద కుమార్తె సుహాసినిరెడ్డిని మునుగోడు మండలం గుడాపూర్‌కు చెందిన నన్నూరి సంజీవరెడ్డికి ఇచ్చి 2004లో వివా హం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు. ఉద్యోగరీత్యా న్యూజిలాండ్‌ వెళ్లి పౌరసత్వం పొందారు. సుహాసిని ప్రస్తుతం ఆ్రస్టేలియాలో పనిచేస్తున్నారు. ఇటీవల ఎల్‌బీనగర్‌ చంద్రపురి కాలనీలో గృహ ప్రవేశం చేశారు. 

ఈ నెల 23న మానస సరోవర్‌ యాత్రకు వెళ్లారు. ఈమె వెంట వెళ్లాల్సిన హబ్సిగూడ డాక్టర్‌ శిరీష చివరి నిమిషంలో ఆగిపోయా రు. దీంతో ఆ్రస్టేలియాలో ఉండే స్నేహితురాలిని కలుపుకొని సుహాసిని టూర్‌కు వెళ్లారు. ఖాట్మండ్‌ నుంచి కళ్యాణ్‌ కైలాష్‌ జర్నీస్‌ టూర్స్‌–ట్రావెల్స్‌ ద్వారా మొత్తం 29 మంది యాత్రకు బయల్దేరారు. చివరగా నేపాల్‌లోని «ధుంచే–స్యాబ్రుబెసి ప్రాంతంలో టిబెట్‌ సరిహద్దు వైపు ప్రయాణిస్తున్న వాహనంలో ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం రాత్రి నుంచి సుహాసిని ఫోన్‌ కలవలేదు. తర్వాత వరదలు వచ్చాయని తెలియడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.  

ఆ భవనం వద్ద ఆఖరిసారిగా... 
నాచారం నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడిన లక్ష్మీనాథ్‌ గోపిశెట్టి 8 మందితో కలిసి కైలాస మానససరోవర్‌ యాత్రకు వెళ్లారు. బుధవారం ఉదయం 8.10 గంటలకు ఆఖరిసారిగా కుటుంబ సభ్యులను సంప్రదించారు. ఆ సమయంలో నేపాల్‌లోని ‘రసువా కస్టమ్స్‌ ఆఫీస్‌’వద్ద ఉన్నారు. తర్వాత ఆకస్మిక వరదలతో ఆ కార్యాలయం తుడిచిపెట్టుకుపోయింది. అప్పటినుంచి ఆయనతో సంబంధాలు తెగిపోయాయని ముషీరాబాద్‌కు చెందిన లక్ష్మీనాథ్‌ బంధువు డి.రామచంద్ర తెలిపారు. లక్ష్మీనాథ్‌ బృందం నేపాల్‌కు చెందిన క్లాసిక్‌ వెకేషన్స్‌ ఏజెన్సీ ద్వారా వెళ్లారని, ముంబైలోని ఆ సంస్థ బ్రాంచ్‌ను సంప్రదించగా నిర్వాహకులు తమ బాధ్యత లేదన్నట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. 

కైలాస మానస సరోవర్‌ యాత్రకు వెళ్లిన రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి సురక్షితంగా ఉన్నట్టు తెలిసింది. ఆయన తన కుటుంబ సభ్యులను కూడా సంప్రదించారు. 

సురక్షితంగా ఉన్నాం: సతీశ్‌రెడ్డి 
నేపాల్‌లో తాము క్షేమంగానే ఉన్నామని డీఆర్‌డీఓ మాజీ చైర్మన్‌ సతీశ్‌ రెడ్డితో కూడిన బృందం గురువారం ఒక వీడియో సందేశంలో తెలిపింది. విపత్తు సంభవించే సమయానికి తామంతా అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లిపోయాని స్పష్టం చేసింది. 

ఏపీకి చెందిన నలుగురు క్షేమం
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడుగురు యాత్రి కుల సమాచారం హెల్ప్‌లైన్‌కు అందింది. అయితే.. వారిలో నలుగురు సురక్షితంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement