చిన్నారెడ్డిపై టీపీసీసీకి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు | MLA Meghareddy Complains To TPCC Over Chinna Reddy Issue | Sakshi
Sakshi News home page

చిన్నారెడ్డిపై టీపీసీసీకి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు

Aug 18 2026 5:00 PM | Updated on Aug 18 2026 5:05 PM

MLA Meghareddy Complains To TPCC Over Chinna Reddy Issue

హైదరాబాద్:  తనపై ఆరోపణల కారణంగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత చిన్నారెడ్డిపై టీపీసీసీ ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌ను కోరారు మేఘారెడ్డి. తాను టికెట్‌ అమ్ముకున్నానన్న వ్యాఖ్యలపై పీసీసీకి ఫిర్యాదు చేశారు మేఘారెడ్డి. దీనిపై మహేష్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. చిన్నారెడ్డి మాటల రికార్డింగ్స్‌ ఉన్నాయి. పార్టీ పరిశీలించి చర్యలు తీసుకుంటుంది. క్రమశిక్షణ కమిటీ అన్నీ పరిశీలిస్తోంది’ అని తెలిపారు. 

ఇక తెలంగాణలో  ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్‌)పై మహేష్‌ గౌడ్‌ స్పందిస్తూ.. ‘ మేము ప్రతి ఓటును కాపాడాలని చూస్తున్నాం. EC గైడ్ లైన్స్ తో చాలా నష్టం జరుగుతుంది. తెలంగాణ 3.38 కోట్ల ఓట్లు ఉన్నాయి. ASBD లపేరుతో  22% ఓట్లను తొలగించారు. ఓట్ తొలగింపునకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా బాద్యత వహించాలి. బీద ప్రజల ఓట్లు తొలగి పోతున్నాయి. కాంగ్రెస్  BLA లను 35వేలు మందిని ఇచ్చాం. కానీ EC 13వేల 100 మంది అని చూపిస్తున్నారు. 

2002లో ఓటు వేసి ఉండాలని కండిషన్ తో చాలా మంది ఎన్యుమరేషన్‌ ఫామ్‌ ఇవ్వలేకపోయారు. ఎన్యుమరేషన్ పామ్ ఇవ్వలేదని డిలీట్ చేస్తున్నారు. అన్ మ్యాప్డ్ ఓట్లు 32 లక్షల 37వేలు. డౌట్‌ ఫుల్ గా ఉన్నాయి 60 లక్షల 50 వేలు ఓట్లు చూపిస్తున్నారు. 92లక్షల ఓట్లు ప్రశ్నార్థకంగా మారాయి. 1.60 కోట్ల ఓట్లకు ఎందుకు క్వచ్చన్ మార్క్ పెట్టారో చెప్పాలి. కాంగ్రెస్ ప్రతి పౌరుడి ఓటు కాపాడాలని ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో ఇంకా టైం ఇవ్వాలి’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement