మద్యం ప్రియులకు అలెర్ట్.. తెలంగాణలో బార్లు బంద్‌‌! | Bar Owners Call for Statewide Shutdown in Telangana Starting Tomorrow | Sakshi
Sakshi News home page

మద్యం ప్రియులకు అలెర్ట్.. తెలంగాణలో బార్లు బంద్‌‌!

Oct 4 2026 11:40 AM | Updated on Oct 4 2026 11:46 AM

Bar Owners Call for Statewide Shutdown in Telangana Starting Tomorrow

సాక్షి,హైదరాబాద్‌: ప్రివిలేజ్‌ ఫీజు పేరుతో ప్రభుత్వం తమపై విపరీతమైన ఆర్థిక భారం మోపుతోందని మండిపడుతూ తెలంగాణ రాష్ట్ర రెస్టారెంట్‌, బార్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి తెలంగాణలో బార్లు బంద్‌ పాటించేందుకు పిలుపునిచ్చాయి.  

ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలు ఉధృతం చేయాలని నిశ్చయించుకున్న బార్ల యజమానులు, సోమవారం (అక్టోబర్ 5) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బార్‌ అండ్‌ రెస్టారెంట్లను పూర్తిగా మూసి వేయనున్నట్లు ప్రకటించారు. ఈ బంద్‌ పిలుపుతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దాదాపు 1,200లకు పైగా బార్‌ అండ్‌ రెస్టారెంట్లు మూతపడనున్నాయి.

ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో బార్‌ స్లాబ్స్‌‌ ప్రకారం ప్రివిలేజ్‌ ఫీజును 8 శాతం నుంచి ఏకంగా 20 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం బార్‌ యజమానుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఇప్పటికే లైసెన్సు ఫీజుల రూపేణా ఏటా రూ.33 లక్షల నుంచి రూ.56 లక్షల వరకు చెల్లిస్తున్నామని, ఇప్పుడు కొత్తగా తెచ్చిన ప్రివిలేజ్‌ ఫీజు వల్ల ఒక్కో బార్‌పై అదనంగా మరో రూ.30 లక్షల వరకు భారం పడుతుందని యజమనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ఈ సమస్యపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర రెస్టారెంట్‌, బార్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు నేరుగా ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి తమ గోడును వెళ్లగక్కారు. బార్ల నిర్వహణ నిబంధనలు, లైసెన్స్‌ ఫీజులు మరియు అడ్డగోలుగా పెంచిన ప్రివిలేజ్‌ ఫీజు జీవోను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు.  

ప్రభుత్వం నుంచి స్పందన వచ్చే వరకు బంద్‌ కొనసాగుతుందని, డిమాండ్లు నెరవేరకపోతే నిరాహార దీక్షలతో పాటు భవిష్యత్తులో మరింత ఉధృతమైన ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని అసోసియేషన్ స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement