కూకట్‌పల్లి ట్రక్‌ యార్డు భూముల వేలానికి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ | Telangana HC Clears Deck for Kukatpally Truck Yard Land Auction | Sakshi
Sakshi News home page

కూకట్‌పల్లి ట్రక్‌ యార్డు భూముల వేలానికి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

Nov 27 2026 11:34 AM | Updated on Nov 27 2026 11:47 AM

Telangana HC Clears Deck for Kukatpally Truck Yard Land Auction

సాక్షి,హైదరాబాద్‌: కూకట్‌పల్లి (మూసాపేట)ట్రక్‌ యార్డు భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రక్‌ పార్క్‌ భూముల్ని వేలం వేసుకోవచ్చని తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

ట్రక్‌ యార్డు భూముల వేలం ఆపాలని కూకట్‌పల్లి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావ్ పిటిషన్‌తో పాటు సామాజిక కార్యకర్త కాంతారావు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశారు. మాధవరం కృష్ణారావు పిటిషన్‌తో పాటు కాంతారావు వేసిన పిటిషలన్‌ను హైకోర్టు డిస్మిస్‌ చేసింది.

దీంతో నేడు జరగనున్న భూముల వేలానికి అడ్డంకులు తొలగిపోయాయి. వేలం ప్రక్రియ కొనసాగించేందుకు మార్గం సుగమమైంది. హైకోర్టు తీర్పుతో వేలంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement