హైదరాబాద్‌ను అర్ధరాత్రి భారీ వర్షం ముంచెత్తింది. తెల్లవారుజామున నగరం ఒక్కసారిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. రెండు మూడు గంటల పాటు కురిసిన కుండపోతతో రహదారులన్నీ చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోగా.. డ్రైనేజీలు, నాలాలు పొంగిపొర్లడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్, కంటోన్మెంట్, మారేడుపల్లి, ఉప్పల్, బేగంపేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, ఎస్‌ఆర్ నగర్, పలు ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది.
తెలంగాణలో ఐదు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సంగారెడ్డి, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో భారీ పడే అవకాముందని. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం పడే ఛాన్స్ ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది.


