పదవులు భర్తీ చేద్దాం! | Telangana Congress Focuses on Filling Vacant Positions | Sakshi
Sakshi News home page

పదవులు భర్తీ చేద్దాం!

Nov 27 2026 6:11 AM | Updated on Nov 27 2026 6:11 AM

Telangana Congress Focuses on Filling Vacant Positions

సాగదీయకుండా వీలున్నంత త్వరగా ఫుల్‌స్టాప్‌ పెట్టేద్దాం 

ఎన్ని పదవులు, ఎంత మందికి ఇచ్చినా అసంతృప్తి ఉంటుంది 

కాలయాపన చేసే కొద్దీ అది అసమ్మతిగా మారుతుంది 

డిసెంబర్‌ మొదటి వారంలోపు నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీ ప్రక్రియ పూర్తి కావాలి 

పార్టీ ఇన్‌చార్జ్‌ సందీప్, సీఎం రేవంత్‌ల భేటీలో నిర్ణయం

ప్రజాభవన్‌ గెస్ట్‌హౌస్‌లో ఇద్దరి భేటీ  

సాక్షి, హైదరాబాద్‌: పదవుల పందేరాన్ని సాగదీయకుండా వీలున్నంత త్వరగా ఫుల్‌స్టాప్‌ పెట్టాలనే అభిప్రాయానికి అధికార కాంగ్రెస్‌ ముఖ్యులు వచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ బీఎం.సందీప్, సీఎం రేవంత్‌రెడ్డిల భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్‌ మొదటివారంలోపు అటు నామినేటెడ్, ఇటు పార్టీ పదవుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలనే ఏకాభిప్రాయానికి వచ్చారు. సంవిధాన్‌ రక్షా మార్చ్‌ ర్యాలీకి ముందు గురువారం ప్రజాభవన్‌ గెస్ట్‌హౌస్‌లో సందీప్, రేవంత్‌రెడ్డిలు సమావేశమయ్యారు.

దాదాపు గంటన్నరకు పైగా జరిగిన ఈ సుదీర్ఘ భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పార్టీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్‌ పరిస్థితి ఏంటన్న దానిపై చాలాసేపు చర్చ జరిగింది. ఇప్పటివరకు పార్టీ నాయకత్వానికి ఇచ్చిన నామినేటెడ్‌ పదవులు, పార్టీ హోదాల గురించి సీఎం రేవంత్‌ వివరించారు. అ«ధికారంలోకి వచ్చిన తర్వాత 50కి పైగా నామినేటెడ్‌ చైర్మన్‌ పదవులు ఇచ్చామని, పార్టీ కోసం కష్టపడిన వారందరికీ ఏదో విధంగా అవకాశం కల్పించామని తెలిపారు.

మరోమారు ఈ నామినేటెడ్‌ పదవులు ఇవ్వాల్సి ఉందని, అయితే ఆశావహుల జాబితా పెద్దదిగా ఉన్న నేపథ్యంలో ఎన్ని పదవులను భర్తీ చేయగలం, ఎవరికి పదవులు ఇవ్వాలి, తద్వారా వ్యక్తమయ్యే అసంతృప్తి ఎలా ఉంటుందనే అంశాలను బేరీజు వేస్తున్నామని వివరించారు.

ఇందుకు స్పందించిన ఇన్‌చార్జ్‌ సందీప్‌ అసంతృప్తి ఎ ప్పుడూ ఉంటూనే ఉంటుందని, ఎన్ని పదవులు ఎంత మందికి ఇచ్చినా ఏదో ఒక మూల అసంతృప్తి కనిపిస్తుందని, అలాగని పదవుల భర్తీని సాగదీసుకుంటూ వెళితే ఆ అసంతృప్తి అసమ్మతిగా మారుతుందనే అభిప్రాయాన్ని వ్య క్తం చేశారు. ఈ నేపథ్యంలో వీలున్నంత త్వరగా అటు నా మినేటెడ్‌ పదవులు, ఇటు పార్టీ పదవులను భర్తీ చేయాలని, వీలు ను బట్టి డిసెంబర్‌ మొదటివారంలో జరిగే గ్లోబల్‌ సమ్మిట్‌కు ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు.  

పలు అంశాలపై చర్చ 
మూడేళ్ల ప్రభుత్వ పనితీరు, రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ముఖ్యమైన వాగ్దానాల పరిస్థితి, ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరిస్తున్న వ్యూహాలు, నామినేటెడ్‌ ఎమ్మెల్సీల భర్తీలో జాప్యానికి గల కారణాలు, బీఆర్‌ఎస్, బీజేపీల వైఖరి, పార్టీ సోషల్‌మీడియా పనితీరు, మంత్రివర్గంలో ఖాళీలు, మంత్రుల పనితీరు తదితర అంశాలపై ఇద్దరూ చర్చించారు.  

⇒ ముఖ్యంగా రెండోసారి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి గల అవకాశాలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ జరిగింది.రానున్న రెండేళ్ల కాలంలో ప్రజలకు మరింత చేరువయ్యేలా కార్యక్రమాలను చేపట్టాలని, పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చెప్పిన విధంగా కోటి ఓట్లు... 90 సీట్లే లక్ష్యంగా ముందుకెళ్లాలని సందీప్‌ దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.  

⇒ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి వెళతాయా, విడివిడిగా పోటీ చేస్తాయా అనే అంశంతో పాటు నియోజకవర్గాల పునరి్వభజన, మహిళా రిజర్వేషన్ల అంశం కూడా తేలాల్సి ఉందని, ఈ పరిణామాలను బట్టి అవసరమైన వ్యూహాలతో ముందుకెళ్లాల్సి ఉంటుందని ఇద్దరు నేతలు మాట్లాడుకున్నట్టు తెలిసింది.  

పనితీరు ఓకే.. సమన్వయమే ముఖ్యం 
రేవంత్‌ నేతృత్వంలోని ప్రభుత్వ పనితీరు పట్ల ఇన్‌చార్జ్‌ సందీప్‌ సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. రైతు రుణమాఫీ మొదలు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, పేదలకు సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ప్రతి కుటుంబానికి బీమా లాంటి పథకాలు బాగున్నాయని ఆయన చెప్పినట్టు సమాచారం.

అయితే, ప్రభుత్వ పనితీరుతోపాటు పార్టీతో సమన్వయం కూడా ముఖ్యమని, ఆ కోణంలో ఎక్కడా అభిప్రాయ భేదాలకు తావు లేకుండా పనిచేయాలని, ప్రభుత్వ పనితీరు,పార్టీ పరంగా తీసుకోవాల్సిన కార్యక్రమాలపై వ్యూ హాత్మకంగా ముందుకెళ్లాలని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. పారీ్టలో వినిపిస్తున్న అసమ్మతి స్వరాలపై ఇద్దరి మ« ద్య చర్చ జరిగింది. మునుగోడు, జడ్చర్ల ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, అనిరు«ద్‌రెడ్డిలతో సమావేశం సందర్భంగా వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై కూడా ఇరువురు చర్చించారు.  
డిసెంబర్‌ 15 నుంచి జిల్లాల యాత్ర చేస్తానని సందీప్‌ తెలిపారు.

టీపీసీసీ చీఫ్‌తోనూ భేటీ 
సీఎం రేవంత్‌తో సమావేశానంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ సందీప్‌ గురువారం మధ్యాహ్నం టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌తో సమావేశమయ్యారు. నామినేటెడ్‌ పోస్టులు, ఏఐసీసీ కార్యదర్శులు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, ఇతర పార్టీ పదవుల భర్తీ, ప్రభుత్వంతో సమన్వయం, ప్రభుత్వ వ్యవహారాల్లో పారీ్టకి తగిన ప్రాధాన్యం, డీసీసీ అధ్యక్షులకు ప్రొటోకాల్‌ కల్పించే అంశం, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు, నామినేటెడ్‌ ఎమ్మెల్సీల నియామకంలో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై చర్చించినట్టు తెలిసింది. ఆ తర్వాత మంత్రి అజహరుద్దీన్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement