T20 WC 2026: విండీస్‌ను చిత్తు చేసి సెమీ ఫైనల్లో టీమిండియా | T20 WC 2026: Sanju Shines India Beat West Indies Enters Semi Final | Sakshi
Sakshi News home page

T20 WC 2026: విండీస్‌ను చిత్తు చేసి సెమీ ఫైనల్లో టీమిండియా

Mar 1 2026 10:47 PM | Updated on Mar 1 2026 11:03 PM

T20 WC 2026: Sanju Shines India Beat West Indies Enters Semi Final

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో టీమిండియా సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. సూపర్‌-8 దశలో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ (IND Beat WI)ను ఓడించి టైటిల్‌ దిశగా కీలక ముందడుగు వేసింది. కోల్‌కతా వేదికగా ఈడెన్‌ గార్డెన్స్‌లో ఆదివారం టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

195 పరుగులు
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్లలో కెప్టెన్‌ షాయీ హోప్‌ (33 బంతుల్లో 32) ఫర్వాలేదనిపించగా.. రోస్టన్‌ ఛేజ్‌ (25 బంతుల్లో 40) రాణించాడు.

మిగిలిన వారిలో షిమ్రన్‌ హెట్‌మైర్‌ (12 బంతుల్లో 27) ధనాధన్‌ దంచికొట్టగా.. షెర్ఫానే రూథర్‌ఫర్డ్‌ (9 బంతుల్లో 14) రాణించాడు. ఆఖర్లో రోవ్‌మన్‌ పావెల్‌ (19 బంతుల్లో 34), జేసన్‌ హోల్డర్‌ (22బంతుల్లో 37) మెరుపు ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచారు.

నిరాశపరిచిన అభిషేక్‌, ఇషాన్‌
భారత బౌలర్లలో జస్‌ప్రీత్‌ బుమమ్రా రెండు వికెట్లు తీయగా.. హార్దిక్‌ పాండ్యా, వరుణ్‌ చక్రవర్తి తలా ఒక వికెట్‌ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (11 బంతుల్లో 10) స్వల్ప స్కోరుకే వెనుదిరగగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ (6 బంతుల్లో 10) సైతం నిరాశపరిచాడు.

సంజూ బాధ్య‌తాయుత ఇన్నింగ్స్‌
కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (16 బంతుల్లో 18) చేతులెత్తేయగా.. తిల‌క్ వ‌ర్మ (15 బంతుల‌లో 27) వేగంగా ఆడే క్ర‌మంలో అవుట‌య్యాడు. ఇలాంటి ద‌శ‌లో ఓపెన‌ర్ సంజూ శాంస‌న్ బాధ్య‌తాయుత ఇన్నింగ్స్‌తో స్కోరు బోర్డును ముందుకు న‌డిపాడు. 

 

అయితే విజ‌యానికి 10 బంతులలో 17 ప‌రుగులు అవ‌స‌ర‌మైన వేళ హార్దిక్ పాండ్యా (14 బంతుల‌లో 17) రూపంలో భార‌త్ ఐదో వికెట్ కోల్పోయింది. ఈ క్ర‌మంలో శివం దూబే సంజూకు జ‌త‌య్యాడు. దూబే 4 బంతుల‌లో 8 ప‌రుగులు చేయ‌గా.. సంజూ ఆఖ‌రి ఓవ‌ర్లో సిక్స‌ర్‌, ఫోర్ బాది టీమిండియాను విజ‌య‌తీరాల‌కు చేర్చాడు. 

సెంచ‌రీకి మూడు ప‌రుగుల దూరంలో
ఈ  మ్యాచ్‌లో సంజూ మొత్తంగా 50 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 4 సిక్స‌ర్ల సాయంతో 97 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. సెంచ‌రీకి మూడు ప‌రుగుల దూరంలో నిలిచిపోయినా చిరస్మ‌ర‌ణీయ ఇన్నింగ్స్‌తో జ‌ట్టుకు విజ‌యం అందించాడు. ఇక మ‌రో నాలుగు బంతులు మిగిలి ఉండ‌గానే ల‌క్ష్యాన్ని ఛేదించిన టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విండీస్‌ను ఓడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement