రాణించిన పాక్ బ్యాట‌ర్లు.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే? | Sahibzada Farhans Half-Century Helps Pakistan Reach 164-9 vs England | Sakshi
Sakshi News home page

T20 WC 2026: రాణించిన పాక్ బ్యాట‌ర్లు.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?

Feb 24 2026 8:49 PM | Updated on Feb 25 2026 9:11 AM

Sahibzada Farhans Half-Century Helps Pakistan Reach 164-9 vs England

టీ20 ప్రపంచ‌క‌ప్‌-2026లో భాగంగా ప‌ల్లెక‌లే వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న సూప‌ర్‌-8 మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓ మోస్తారు స్కోరుకే ప‌రిమితమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 164 ప‌రుగులు చేసింది.

ఓపెన‌ర్ సైమ్ అయూబ్‌(9), కెప్టెన్ స‌ల్మాన్ అఘా(5) నిరాశ‌ప‌రిచిన‌ప్ప‌టికి.. సాహిబ్జాదా ఫర్హాన్(63), ఫ‌ఖర్ జ‌మాన్(25), బాబ‌ర్ ఆజం(25),షాదాబ్ ఖాన్‌(23) రాణించారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో లైమ్ డాస‌న్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ఓవ‌ర్ట‌న్, జోఫ్రా అర్చ‌ర్ త‌లా రెండేసి వికెట్లు చోప్పున సాధించారు.

తుది జ‌ట్లు
ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీప‌ర్‌), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్(కెప్టెన్‌), సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్

పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(కెప్టెన్‌), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీప‌ర్‌), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్
 

Advertisement
 
Advertisement
Advertisement