IPL 2025: లక్నోపై సూపర్ విక్టరీ.. ప్లే ఆఫ్స్‌కు చేరువలో పంజాబ్‌ | IPL 2025: Punjab Kings beats Lucknow Super Giants by 37 runs | Sakshi
Sakshi News home page

IPL 2025: లక్నోపై సూపర్ విక్టరీ.. ప్లే ఆఫ్స్‌కు చేరువలో పంజాబ్‌

May 4 2025 11:23 PM | Updated on May 4 2025 11:23 PM

IPL 2025: Punjab Kings beats Lucknow Super Giants by 37 runs

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025లో పంజాబ్ కింగ్స్ మ‌రో అద్బుత విజ‌యం న‌మోదు చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ధ‌ర్మ‌శాల వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 37 ప‌రుగుల తేడాతో పంజాబ్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 236 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.

ఈ మ్యాచ్‌లో పంజాబ్ బ్యాట‌ర్లు విధ్వంసం సృష్టించారు. ల​‍క్నో బౌలర్లను పంజాబ్ బ్యాటర్లు ఊతికారేశారు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌(91) టాప్ స్కోరర్‌గా నిలవగా.. శ్రేయస్ అయ్యర్‌(45), శశాంక్ సింగ్‌(33), ఇంగ్లిష్‌(30) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. లక్నో బౌలర్లలో ఆకాష్ మహారాజ్ సింగ్‌, దిగ్వేష్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు.

బదోని ఒక్కడే..
అనంతరం 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 199 పరుగులు మాత్రమే చేయగల్గింది. లక్నో బ్యాటర్లలో అయూష్ బదోని(74) ఒంటరి పోరాటం చేయగా.. అబ్దుల్ సమద్‌(45) పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా చేతులేత్తేశారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఒమర్జాయ్ రెండు, జాన్సెన్, చాహల్ తలా వికెట్ సాధించారు. ఈ విజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో రెండో స్దానానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించేందుకు కింగ్స్ అడుగు దూరంలో నిలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement