ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆరంభంలో వరుస ఓటుములతో తడబడిన ముంబై ఇండియన్స్.. ఇప్పుడు అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఆదివారం వాంఖడే వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది.
ముంబైకి ఇది వరుసగా ఐదో విజయం కావడం గమనార్హం. దీంతో పాయింట్ల పట్టికలో ముంబై ఇడియన్స్ మూడో స్ధానానికి చేరుకుంది. ఈ క్రమంలో ముంబై జట్టుపై టీమిండియా మాజీ ప్లేయర్ పీయాష్ చావ్లా ప్రశంసల వర్షం కురిపించాడు. ముంబై జట్టులో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారని, ప్రతీ జట్టు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశాడు.
"ముంబై ప్లేయింగ్ ఎలెవన్‌లో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఈ రోజు జస్ప్రీత్ బుమ్రా వంతు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ముంబై ఇండియన్స్ మంచి రిథమ్‌లో ఉంది. ముంబై ఇటువంటి రోల్‌లో ఉన్నప్పుడు, కచ్చితంగా ఇతర జట్లు వారిని చూసి భయపడాలి.
ముంబై ప్లేయింగ్ ఎలెవన్‌లో మొదటి నుంచి చివరి వరకు అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. ర్యాన్ రికెల్టన్ ఈ రోజు మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విల్ జాక్స్ బంతితో ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లను పడగొట్టాడు. ప్రస్తుతం ముంబై సరైన ట్రాక్‌లో ఉందని లక్నో మ్యాచ్ అనంతరం చావ్లా పేర్కొన్నాడు.