ఐపీఎల్-2026 సీజన్‌కు ముందు తమ కోచింగ్ స్టాప్‌లో సమూల మార్పులు చేసేందుకు సిద్దమైంది. మొన్నకు మొన్న మెంటార్ జహీర్ ఖాన్‌పై వేటు వేసిన లక్నో యాజమాన్యం.. ఇప్పుడు హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్‌ను తప్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆండీ ఫ్లవర్ తర్వాత లక్నో ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన లాంగర్.. భారత ఆటగాళ్లతో సరైన బంధాన్ని ఏర్పరచుకోలేకపోయారని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో భారత్‌కు చెందిన మాజీ క్రికెటర్‌ను తమ హెడ్ కోచ్‌గా నియమించాలని లక్నో భావిస్తున్నట్లు సమాచారం.
హెడ్ కోచ్‌గా యువరాజ్..?
ఇన్‌సైడ్ స్పోర్ట్ కథనం ప్రకారం.. లక్నో ఫ్రాంచైజీ మెనెజ్‌మెంట్ తమ జట్టు ప్రధాన కోచ్‌గా భారత క్రికెట్ దిగ్గజం, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ను తీసుకురావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుందంట. యువరాజ్ సింగ్‌తో ఫ్రాంచైజీ యాజమాన్యం ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
యువీ ఇప్పటివరకు ఏ ప్రొఫెషనల్ జట్టుకు హెడ్ కోచ్‌గా పనిచేయకపోయినా.. అబుదాబి టి10 లీగ్‌లో మాత్రం మెంటార్‌గా వ్యవహరించాడు. అయితే పంజాబ్‌కు చెందిన ఎంతో మంది యువ ఆటగాళ్లను మాత్రం తన అనుభవంతో యువీ తీర్చిదిద్దాడు. ప్రస్తుత భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, ప్రియాన్ష్ ఆర్య వంటి సంచలన ప్లేయర్లు యువరాజ్ శిష్యులే. ఒకవేళ యువరాజ్ నిజంగా కోచ్‌గా వస్తే లక్నో తలరాత మారినట్లే.
ఇక ఇది ఇలా ఉండగా.. లక్నో సూపర్ జెయింట్స్ ఇటీవల కొన్ని కొత్త నియమాకాలు చేపట్టింది. న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ వ్యూహాత్మక సలహాదారుగా (Strategic Advisor), బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్, స్పిన్ బౌలింగ్ కోచ్‌గా కార్ల్ క్రోవ్ లక్నో జట్టులోకి చేరారు. కాగా గత సీజన్‌లో పంత్ సారథ్యంలోని లక్నో జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరడంలో విఫలమైంది.
చదవండి: స్మృతి మంధాన పెళ్లి డేట్ ఫిక్స్!.. వరుడు ఎవరంటే?


