
PC: BCCI/IPL.com
టీమిండియా వెటరన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా ( బంతులు పరంగా) 150 వికెట్ల మైలు రాయిని అందుకున్న బౌలర్‌గా హర్షల్ నిలిచాడు. 2381 బంతుల్లో ఈ ఫీట్‌ను పటేల్ అందుకున్నాడు. ఐపీఎల్-2025లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనతను పటేల్ నమోదు చేశాడు.
ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక పేస్ బౌలింగ్ దిగ్గజం లసిత్ మలింగ(2444 బంతులు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మలింగ రికార్డును హర్షల్ పటేల్ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా మ్యాచ్‌లు పరంగా ఈ ఫీట్ సాధించిన జాబితాలో హర్షల్ పటేల్(117) రెండో స్దానంలో నిలిచాడు. తొలి స్ధానంలో మలింగ(105) కొనసాగుతున్నాడు.
ఐపీఎల్‌లో బంతులు పరంగా అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
2381- హర్షల్ పటేల్
2444- లసిత్ మలింగ
2543- చాహల్
2656- డ్వైన్ బ్రావో
2832- జస్ప్రీత్ బుమ్రా
మ్యాచ్‌ల పరంగా అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
లసిత్ మలింగ- 105
హర్షల్ పటేల్- 117
యుజ్వేంద్ర చాహల్-118
రషీద్ ఖాన్- 122
జస్ప్రీత్ బుమ్రా- 124