
ఐపీఎల్-2026 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ సపోర్ట్ స్టాప్‌లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆ జట్టు మెంటార్, టీమిండియా పేస్ బౌలింగ్ దిగ్గజం జహీర్ ఖాన్‌పై వేటు వేసేందుకు లక్నో యాజమాన్యం సిద్దమైనట్లు తెలుస్తోంది.
గత ఐపీఎల్ సీజన్‌లో లక్నో దారుణ ప్రదర్శన కనబరిచింది. వరుసగా రెండో సీజన్‌లోనూ ప్లే ఆఫ్స్‌కు చేరడంలో లక్నో విఫలమైంది. 14 మ్యాచ్‌లలో కేవలం ఆరింట మాత్రమే విజయం సాధించిన సూపర్ జెయింట్స్.. పాయింట్ల పట్టికలో ఏడో స్ధానంతో సరిపెట్టుకుంది.
కాగా ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు గౌతమ్ గంభీర్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీతో జత కట్టిన తర్వాత లక్నో కోచింగ్ స్టాప్‌లో జహీర్ చేరాడు. ఆ ఏడాది సీజన్‌నూ లక్నో ఏడో స్ధానంతో ముగించింది. జహీర్ మెంటార్‌గా ఉంటూనే లక్నో బౌలింగ్ కోచ్ బాధ్యతలు కూడా నిర్వర్తించాడు.
అయితే జాక్ మెంటార్‌షిప్ పట్ల లక్నో మెన్‌జ్‌మెంట్ ఆసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అతడికి వీడ్కోలు పలికి మరొకరిని నియమించాలని సూపర్ జైంట్స్ ఫ్రాంఛైజీ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
ఇప్పటికే లక్నో కొత్త బౌలింగ్ కోచ్ అరుణ్ భరత్ ఎంపికయ్యాడు. త్వరలో కొత్త మెంటార్‌ను కూడా లక్నో నియమించనుంది. అంతేకాకుండా ఆర్‌పీస్‌జీ గ్రూపు ఆద్వర్యంలో ఉన్న అన్ని జట్లను పర్యవేక్షించేందుకు కొత్త క్రికెట్ డైరెక్టర్‌ను కూడా నియమించేందుకు సంజీవ్ గోయోంకా సిద్దమైనట్లు తెలుస్తోంది.
మరోవైపు భారీ అంచనాలు పెట్టుకున్న లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ సైతం రాణించలేకపోయాడు. ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ మినహా మిగితా మ్యాచ్‌లలో పంత్ విఫలమయ్యాడు. కాగా పంత్‌ను రూ. 27 కోట్ల రికార్డు ధరకు లక్నో ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది.
చదవండి: AUS vs SA: చరిత్ర సృష్టించిన బ్రెవిస్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు