IPL 2025: ల‌క్నోను చిత్తు చేసిన ఎస్ఆర్‌హెచ్‌.. | IPL 2025: Lucknow Super Giants vs Sunrisers Hyderabad Live Updates | Sakshi
Sakshi News home page

IPL 2025: ల‌క్నోను చిత్తు చేసిన ఎస్ఆర్‌హెచ్‌..

May 19 2025 7:02 PM | Updated on May 19 2025 11:30 PM

IPL 2025: Lucknow Super Giants vs Sunrisers Hyderabad Live Updates

PC: BCCI/IPL.com

IPL 2025 LSG vs DC Live Updates:

ల‌క్నోను చిత్తు చేసిన ఎస్ఆర్‌హెచ్‌..
ఏక్నా స్టేడియం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన కీల‌క మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఓట‌మి పాలైంది. దీంతో ఈ ఏడాది సీజ‌న్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి ల‌క్నో నిష్క్ర‌మించింది.  206 ప‌రుగుల ల‌క్ష్యాన్ని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కేవ‌లం నాలుగు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 18.2 ఓవ‌ర్ల‌లో చేధించింది. 

ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌లో అభిషేక్ శ‌ర్మ‌(20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌ల‌తో 59) విధ్వంస‌క‌ర హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగ‌గా.. క్లాసెన్‌(47), ఇషాన్ కిష‌న్‌(35), మెండిస్‌(32) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. ల‌క్నో బౌల‌ర్ల‌లో దిగ్వేష్ సింగ్ రెండు, విలియం ఓ రూర్క్, శార్ధూల్‌ ఠాకూర్‌ ఓ వికెట్ సాధించారు.

16 ఓవ‌ర్ల‌కు ఎస్ఆర్‌హెచ్ స్కోర్‌: 179/3
16 ఓవ‌ర్ల‌కు ఎస్ఆర్‌హెచ్ 3 వికెట్ల న‌ష్టానికి 179 ప‌రుగులు చేసింది. స‌న్‌రైజ‌ర్స్ విజ‌యానికి 24 బంతుల్లో 27 ప‌రుగులు కావాలి.

ఎస్ఆర్‌హెచ్ మూడో వికెట్ డౌన్‌
ఇషాన్ కిష‌న్(35) రూపంలో స‌న్‌రైజ‌ర్స్ మూడో వికెట్ కోల్పోయింది. దిగ్వేష్ సింగ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు.

ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో వికెట్‌ డౌన్‌..
అభిషేక్ శ‌ర్మ రూపంలో ఎస్ఆర్‌హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 59 ప‌రుగులు చేసిన అభిషేక్ శ‌ర్మ‌.. దిగ్వేష్ సింగ్ రాఠీ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 9 ఓవ‌ర్ల‌కు స‌న్ రైజ‌ర్స్ స్కోర్‌: 117/2
అభిషేక్ శ‌ర్మ ఫిప్టీ
ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో అభిషేక్ శ‌ర్మ దూకుడుగా ఆడుతున్నాడు. కేవ‌లం 18 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ సాధించాడు. 6వ ఓవ‌ర్ వేసిన ర‌వి బిష్ణోయ్ బౌలింగ్‌లో అభిషేక్ వ‌రుస‌గా నాలుగు సిక్స్‌లు బాదాడు. అభిషేక్ 59 ప‌రుగులతో త‌న బ్యాటింగ్‌ను కొన‌సాగిస్తున్నాడు. 7 ఓవ‌ర్లు ముగిసే స‌రికి స‌న్‌రైజ‌ర్స్ వికెట్ న‌ష్టానికి 98 ప‌రుగులు చేసింది.

దూకుడుగా ఆడుతున్న అభిషేక్‌, కిష‌న్‌..
4 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ వికెట్ న‌ష్టానికి 52 ప‌రుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ‌(23), ఇషాన్ కిష‌న్‌(11) ఉన్నారు.
ఎస్ఆర్‌హెచ్ తొలి వికెట్ డౌన్‌..
206 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఎస్ఆర్‌హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 13 ప‌రుగులు చేసిన ఆధ‌ర్వ తైడే.. విలియం ఓరూర్క్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 2 ఓవర్లకు సన్‌రైజర్స్‌ స్కోర్‌: 23/1
చెలరేగిన లక్నో బ్యాటర్లు..
ఐపీఎల్‌-2025లో ఏక్నా స్టేడియం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ బ్యాట‌ర్లు జూలు విధిల్చారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ల‌క్నో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 205 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది.

ల‌క్నో బ్యాట‌ర్ల‌లో మిచెల్ మార్ష్‌(39 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్‌ల‌తో 65), మార్‌క్ర‌మ్‌(38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 61) హాఫ్ సెంచ‌రీలతో రాణించ‌గా.. నికోల‌స్ పూరన్‌(26 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో  45) మెరుపులు మెరిపించాడు. ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌లో ఇషాన్ మ‌లింగ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. దూబే, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, నితీష్ కుమార్ రెడ్డి త‌లా వికెట్ సాధించారు.

లక్నో మూడో వికెట్‌ డౌన్‌..
ఐడైన్‌ మార్‌క్రమ్‌ రూపంలో లక్నో మూడో వికెట్‌ కోల్పోయింది. 61 పరుగులు చేసిన మార్‌క్రమ్‌.. హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. 17 ఓవర్లు ముగిసే సరికి లక్నో.. 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.

15 ఓవ‌ర్ల‌కు ల‌క్నో స్కోర్‌: 146/2
15 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ రెండు వికెట్ల న‌ష్టానికి 150 ప‌రుగులు చేసింది. క్రీజులో మార్‌క్ర‌మ్‌(53), నికోల‌స్ పూర‌న్‌(16) ఉన్నారు.

ల‌క్నో రెండో వికెట్ డౌన్‌..
రిష‌బ్ పంత్ రూపంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ రెండో వికెట్ కోల్పోయింది. 7 ప‌రుగులు చేసిన పంత్‌.. ఇషాన్ మ‌లింగ బౌలింగ్‌లో పెవిలియ‌న్‌కు చేరాడు. 12 ఓవ‌ర్ల‌కు ల‌క్నో రెండు వికెట్ల న‌ష్టానికి 124 ప‌రుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మార‌క్ర‌మ్‌(49), రిష‌బ్ పంత్‌(7) ఉన్నారు.

ల‌క్నో తొలి వికెట్ డౌన్.. మార్ష్ ఔట్‌
మిచెల్ మార్ష్ రూపంలో ల‌క్నో తొలి వికెట్ కోల్పోయింది. 65 ప‌రుగులు చేసిన మార్ష్‌.. హ‌ర్ష్ దూబే బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 11 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ల‌క్నో వికెట్ న‌ష్టానికి 118 ప‌రుగులు చేసింది. క్రీజులో రిష‌బ్ పంత్‌(2), మార్‌క్ర‌మ్‌(48) ఉన్నారు.

6 ఓవర్లకు లక్నో స్కోర్‌: 69/0
6 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. క్రీజులో మార్‌క్రమ్‌(26), మార్ష్‌(41) ఉన్నారు.
దూకుడుగా ఆడుతున్న మార్ష్‌..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. క్రీజులో మార్ష్‌(18), మార్‌క్రమ్‌(1) ఉన్నారు.

ఐపీఎల్‌-2025లో భాగంగా ఏక్నా స్టేడియం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్లు త‌ల‌ప‌డతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.  ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్ ల‌క్నోకు చాలా కీల‌కం. 

ప్లే ఆఫ్స్ రేసులో నిల‌వాలంటే ఈ మ్యాచ్‌లో పంత్ టీమ్ త‌ప్ప‌క గెల‌వాల్సిందే. మ‌రోవైపు ఇప్ప‌టికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్ర‌మించిన ఆరెంజ్ ఆర్మీ.. త‌మ ఆఖ‌రి మ్యాచ్‌లలో గెలిచి ప‌రువు నెల‌బెట్టుకోవాల‌ని భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు ఎస్‌ఆర్‌హెచ్‌ స్టార్‌ ప్లేయర్‌ ట్రావిస్‌ హెడ్‌ కరోనా కారణంగా దూరమయ్యాడు.

తుది జట్లు
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్‌), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, విలియం ఒరూర్కే

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్‌), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), హర్షల్ పటేల్, హర్ష్ దూబే, జీషన్ అన్సారీ, ఎషాన్ మలింగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement