
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. ఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో సీఎస్‌కే విజయం సాధించింది. ఈ విజయంలో కెప్టెన్ ఎంఎస్ ధోని కీలక పాత్ర పోషించాడు.
ధోని కేవలం 11 బంతుల్లోనే 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 26 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు శివమ్ దూబే(43 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఫలితంగా 167 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో చేధించింది. రచిన్ రవీంద్ర(37), షేక్ రషీద్(27) పరుగులతో రాణించారు.
లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు వికెట్లు పడగొట్టగా.. దిగ్వేష్, మార్‌క్రమ్, అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. రిషబ్ పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.
49 బంతులు ఎదుర్కొన్న పంత్.. 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63 పరుగులు చేశాడు. అతడితో పాటు మార్ష్(30), బదోని(22) రాణించారు. సీఎస్‌కే బౌలర్లలో రవీంద్ర జడేజా,పతిరానా తలా రెండు వికెట్లు సాధించగా.. ఖాలీల్ అహ్మద్, కాంబోజ్ ఒక్క వికెట్ పడగొట్టారు.
చదవండి: IPL 2025: ఎస్ఆర్‌హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు..